వివో నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ ఖరారు.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!!
వివో నుంచి త్వరలో Y సిరీస్ స్మార్ట్ ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. ఇవాళ సంస్థ నుంచి కీలక ప్రకటన వెలువడింది. వివో Y58 5G స్మార్ట్‌ఫోన్‌ను (Vivo Y58 5G Smartphone Launch Date) జూన్ 20న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకు వివో కొత్త స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధరపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే టీజర్ ఆధారంగా ఈ వివో Y58 హ్యాండ్‌సెట్ గురించి కొన్ని వివరాలు తెలిశాయి.
టీజర్ ఆధారంగా వివో కొత్త స్మార్ట్ ఫోన్ వెనుకవైపు వృత్తాకర కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంది. దీంతోపాటు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండనుంది. మరియు LED ఫ్లాష్ లైట్‌తో రానుంది. మరియు మ్యాటీ ఫినిష్ సహా గ్లోసీ ఎడ్జ్‌లను కలిగి ఉండనుంది.

ఈ వివో Y58 5G స్మార్ట్ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. బ్లూ మరియు గ్లీన్ రంగుల్లో లభిస్తుంది. అయితే టీజర్ ఆధారంగా గ్రీన్ కలర్ ఫోన్ ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ధరపై ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు.
అయితే ఇటీవల X (ట్విట్టర్) యూజర్ AN Leaks ఈ స్మార్ట్‌ఫోన్ కు సంబంధించిన కీలక వివరాలను లీక్ చేశారు. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 6.72 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 1024 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో రానుందని తెలుస్తోంది.

లీకైన వివరాల ఆధారంగా వివో Y58 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా, 2MP కెమెరాలు సహా 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 పైన పనిచేసే అవకాశం ఉంది. మరియు స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజీతో జతచేయబడి ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








