6000mAh బ్యాటరీ, 6.72 అంగుళాల డిస్‌ప్లేతో వివో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, సేల్ వివరాలు
వివో నుంచి ఇవాళ వివో Y58 5G స్మార్ట్‌ఫోన్ (Vivo Y58 5G Smartphone) లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్ సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు 6000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతోపాటు భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్‌లోనే గరిష్ఠ బ్రైట్‌నెస్ కలిగిన డిస్‌ప్లేను కలిగి ఉందని సంస్థ చెబుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంటుంది. దీంతోపాటు సేల్ వివరాలు, బ్యాంకు ఆఫర్‌ల వివరాలను కూడా సంస్థ వెల్లడించింది.
వివో Y58 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
వివో Y58 5G స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల పుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2408*1080 పిక్సల్ రిజల్యూషన్ సహా 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 1024 నిట్స్ వరకు గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

ఈ వివో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14 ను కలిగి ఉంది. 4nm ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫాం చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు Adreno 613 GPU తో జతచేయబడి ఉంటుంది. 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు కార్డులో 1TB వరకు స్టోరేజీని పొడిగించుకోవచ్చు.
కెమెరా విభాగం ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్ లైట్‌ను గుర్తించవచ్చు. ముందువైపు f/2.05 అపేచర్‌తో 8MP కెమెరాను అమర్చారు.

ఈ వివో Y58 5G స్మార్ట్‌ఫోన్ AI ఫీచర్‌లను కలిగి ఉంటుంది. AI లో లైట్ వంటి ఇమేజింగ్ ఫీచర్‌లను సపోర్టు చేయనుందని తెలిపింది. ఫలితంగా మెరుగైన ఫోటోలను తీయవచ్చని తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G VoLTE, వైఫై 802.11, బ్లూటూత్ 5.1, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. iP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. హిమాలయన్ బ్లూ, సుందర్‌బన్స్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
వివో Y58 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,499 గా ఉంది. ఇవాళ్టి నుంచే వివో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 తగ్గింపును పొందవచ్చు. EMI ఆప్షన్ ద్వారా రోజుకు రూ.35 చెల్లించవచ్చు.


Click it and Unblock the Notifications








