వివో కొత్త ఫోన్ కేక
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీబి, 32జీబి స్టోరేజ్
చైనా ఫోన్‌ల కంపెనీ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. వివో వై66 (Vivo Y66) పేరుతో విడుదలైన ఈ ఫోన్ ఏకంగా 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ధర రూ.14,999. మార్చి, 20 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. క్రౌన్ గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

వివో వై66 ప్రత్యేకతలు.. మెటల్ యునిబాడీ డిజైన్, 5.5 అంగుళాల హైడిఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టం, , 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ, 4G VoLTE సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, జీపీఎస్.
,
Comments
Best Mobiles in India
English summary
Vivo Y66 smartphone launched in India at Rs 14,999, comes with 16MP selfie camera. Read More in Telugu Gizbot..
Story first
published: Saturday, March 18, 2017, 13:19 [IST]


Click it and Unblock the Notifications








