3జిబి ర్యామ్, 6 ఇంచ్ డిస్‌ప్లే ఫోన్ రూ. 10,990కే

Written By:

మొబైల్ రంగంలో దూసుకుపోతున్న చైనా దిగ్గజం ​వివో సరికొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్‌లో 'వివో వై 71' పేరుతో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మాట్ట్ బ్లాక్ అండ్‌ గోల్డ్‌ కలర్స్‌లో విడుదలైన ఈ డివైస్‌ ధర రూ.10,990గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్‌ 14 నుంచి అన్ని ఆఫ్‌లైన్‌ విక్రయ కేంద్రాల్లో విక్రయిస్తామని వివో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే వివో ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, పేటీఎంమాల్ ద్వారా ఏప్రిల్‌ 16 నుంచి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. భారీ డిస్‌ప్లే, మెరుగైన పనితీరు, హై డెఫినిషన్ కెమెరా సామర్థ్యాలతో తమ తాజా స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించామని వివో ఇండియా సీఎంఓ కెన్నీ జెంగ్‌ తెలిపారు.

3జిబి ర్యామ్, 6 ఇంచ్ డిస్‌ప్లే ఫోన్ రూ. 10,990కే

వై 71 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు
6 అంగుళాలఫుల్‌వ్యూ డిస్‌ప్లే 84.4 శాతం స్క్రీన్ బాడీరేషియో
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 425 చిప్‌సెట్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
3జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌
256 జీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం
13ఎంపీ హై డెఫినిషన్ వెనుక కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3360 ఎంఏహెచ్‌ బ్యాటరీ

కాగా గత నెలలో వివో వి9 పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ సెల్ఫీ ఫీచర్స్‌తోపాటు ఐ ఫోన్‌ఎక్స్‌ తరహాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిందట.
వివో వి9 ఫీచర్లు
6.3 అంగుళాల ఫుల్‌ వ్యూ డిస్‌ ప్లే
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
ఆక్టాకోర్‌ క్వాల్కం స్నాప్‌ డ్రాగెన్‌ ప్రాసెసర్‌
1080x2280 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
4జీబీ ర్యామ్‌
64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌
16+5 ఎంపీ డ్యుయల్‌ రియల్‌ కెమెరా
24 ఎంపీ సెల్ఫీ కెమెరా
3260 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మరొక విప్లవానికి తెరలేపనున్న రిలయన్స్ జియో !

ఇదిలా ఉంటే 10జీబీ ర్యామ్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతుందని లీకేజీలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ ఈ లీక్‌లు కనుక నిజమైతే, ఎప్పటి వరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో ఇదే ప్రత్యేక ఆకర్షణ. వివో ఎక్స్‌ప్లే 7 పేరుతో దీన్ని లాంచ్‌ చేస్తుందని, ఇది 4కే ఓలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 845 ఎస్‌ఓసీ, 512 జీబీ స్టోరేజ్‌, అండర్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ వంటి అద్భుత పీచర్లతో రూపొందిందని తెలుస్తోంది. 4ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌తో డ్యూయల్‌ రియర్‌ కెమెరాను ఇది కలిగి ఉందని లీకేజీలు చెబుతున్నాయి. 10జీబీ ర్యామ్‌ కలిగిన ఈ ఫోన్‌ 256జీబీ, 512జీబీ రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో రాబోతుందని తెలుస్తోంది. అయితే ధర, అందుబాటులో ఉండే వివరాలపై ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

English summary
Vivo Y71 With 6-Inch FullView Display Launched in India: Price, Specifications More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot