5,000mAh బ్యాట‌రీతో Vivo నుంచి మిడ్-రేంజ్ మొబైల్ విడుద‌ల‌!

|

వివో కంపెనీ త‌మ మిడ్ రేంజ్ సెగ్‌మెంట్ ను క్ర‌మంగా విస్త‌రిస్తోంది. తాజాగా Vivo Y77e 5G మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్లో విడుద‌ల చేసింది. ఈ మొబైల్ ప్ర‌స్తుతానికి అయితే హోం మార్కెట్ చైనాలో విడుద‌ల చేసింది. ఈ కొత్త మోడ‌ల్ ప‌లు అప్‌గ్రేడెడ్ వ‌ర్ష‌న్‌లతో మార్కెట్లోకి వ‌చ్చింది. దీనికి Dimensity 810 ప్రాసెస‌ర్ అందిస్తున్నారు. అంతేకాకుండా, 6.58 అంగుళాల AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ పూర్తి స్థాయి స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు, ధ‌ర‌ల‌ను కూడా తెలుసుకుందాం.

 
5,000mAh బ్యాట‌రీతో Vivo నుంచి మిడ్-రేంజ్ మొబైల్ విడుద‌ల‌!

Vivo Y77e 5G ధ‌ర‌లు:
Vivo Y77e 5G మొబైల్స్ 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర‌ను CNY 1,699 (భార‌త్‌లో దాదాపు రూ.20వేలు ఉండొచ్చు) గా నిర్ణ‌యించింది. రూ.17,999 గా నిర్ణ‌యించారు. త్వ‌ర‌లో 6GB RAM + 128GB| 8GB RAM + 256GB వేరియంట్ల‌ను కూడా లాంచ్ చేయ‌నున్న‌ట్లు కంపెనీ పేర్కొంది. కొనుగోలుదారులు క్రిస్టల్ బ్లాక్, సమ్మర్ లిజనింగ్ టు ది సీ మరియు క్రిస్టల్ పౌడర్ క‌ల‌ర్ల‌లో ఎంపిక చేసుకోవ‌చ్చు.

Vivo Y77e 5G స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు:
ఈ మొబైల్ కు 6.58 అంగుళాల (1080 x 2408 pixels) రిసొల్యూష‌న్‌తో full-HD AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇది 60Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. సెల్ఫీ కెమెరా కోసం డిస్‌ప్లే పై టేర్ డ్రాప్ క‌టౌట్ ఇస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ Dimensity 810 ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది OriginOS UI ఆధారిత ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ర‌న్ అవుతుంది. ఇక ర్యామ్ విష‌యానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌కు 8GB of RAM+256GB స్టోరేజీ అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

5,000mAh బ్యాట‌రీతో Vivo నుంచి మిడ్-రేంజ్ మొబైల్ విడుద‌ల‌!

ఈ మొబైల్ డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 13-మెగాపిక్సెల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. ఇక మిగ‌తా రెండు కెమెరాల్లో ఒక‌టి 2 మెగాపిక్సెల్ క్వాలిటీతో స‌పోర్టింగ్‌ లెన్స్ ఇస్తున్నారు. ఇక వీడియో కాలింగ్ సెల్ఫీ విష‌యానికొస్తే.. 8 మెగాపిక్సెల్ క్వాలిటీ గ‌ల లెన్స్ ఫ్రంట్ క్యాం కు ఇస్తున్నారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. క‌నెక్టివిటీ ప‌రంగా.. Wi-Fi, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ పోర్ట్‌, USB Type-C ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది.

Vivo Y77e 5G భార‌త్‌లో ఎప్పుడు!
Vivo Y77 5G భారతదేశంలో రూ.20,990 లకు అందుబాటులో ఉంది. కాగా, కొత్త 'e' వేరియంట్ భారతదేశంలో త్వ‌ర‌లోనే విడుద‌ల అవుతుంద‌ని స‌మాచారం. భార‌త్‌లో ఈ కొత్త Vivo Y77e 5G ధర రూ.20 వేల వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు.

5,000mAh బ్యాట‌రీతో Vivo నుంచి మిడ్-రేంజ్ మొబైల్ విడుద‌ల‌!

మ‌రోవైపు, వివో కంపెనీ నుంచి ఫ్లాగ్‌షిప్ మొబైల్ Vivo V25 ప్రో భార‌త్‌లో ఆగ‌స్టు 17న లాంచ్ కాబోతోంది. దాని గురించి కూడా తెలుసుకుందాం:
Vivo V25 ప్రో భారతదేశంలో ఆగస్టు 17 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్క‌రించ‌బ‌డుతుంద‌ని వివో ప్రకటించింది. ఫోన్ రంగు మార్చే బ్యాక్ ప్యానెల్ మరియు 3D కర్వ్డ్ స్క్రీన్‌ను పొందుతుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను పొందుతుంది, హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 1300 SoC, 64-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్. ఇది 66W ఫ్లాష్ ఛార్జ్‌కు మద్దతుతో 4,830mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

 

Vivo V25 ప్రో టీజర్‌:
Vivo ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో Vivo V25 ప్రో లాంచ్ ని సూచిస్తూ ఉన్న టీజర్‌ను ఇప్ప‌టికే షేర్ చేసింది. అంతేకాకుండా, ప్రో మోడల్ V25 సిరీస్‌లో మొదటి ఫోన్ కావచ్చు. ఇప్పటికే V25 ప్రో ఇటీవల అనేక లీక్‌లకు గురైంది. ఈ లీకయిన సమాచారాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, Vivo V25 Pro ఇండియా ధర, స్టోరేజ్ వేరియంట్‌లు మరియు ఇతర వివరాలు ఈ నెల ప్రారంభంలో ఆన్‌లైన్‌లో కనిపించాయి. అలాగే, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల హ్యాండ్‌సెట్‌ను అధికారికంగా ఆవిష్కరించడానికి ముందు వాడుతున్నట్లు లీక్ అయిన ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయిన సంగతి మీకు తెలిసిందే.

Best Mobiles in India

English summary
Vivo Y77e 5G With Dimensity 810 SoC, Dual Cameras Launched: India Price, Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X