Home
Mobile

50MP కెమెరా,12GB RAM తో వివో కొత్త 5G ఫోన్ లాంచ్ అయింది! వివరాలు

By Maheswara

వివో సంస్థ నుంచి మరో కొత్త 5g ఫోన్, Vivo Y78 ప్లస్ పేరుతో కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు నుండి తాజాగా లాంచ్ అయిన ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్‌లలో సేల్ చేయబడుతుంది.ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్లు, ధరలు మరియు ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందో సమాచారం గురించి తెలుసుకుందాం.

వివో యొక్క ఈ కొత్త 5G స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ ద్వారా నిర్మించబడింది. ఇది 12GB వరకు RAMతో జత చేయబడింది.ఇంకా,120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో అమర్చబడింది. ఈ హ్యాండ్‌సెట్‌ను భారతదేశంతో సహా ఇతర మార్కెట్‌లలో ఎప్పుడు విడుదల చేస్తుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Vivo Y78 Plus 5G with 50MP Camera, Snapdragon 695 SoC Processor Launched. Price,Specifications Details.

వివో Y78 ప్లస్ 5G ధర, సేల్ యొక్క వివరాలు, వివో Y78 ప్లస్ 5G ఫోన్ యొక్క ధర 8GB + 128GB వేరియంట్ కోసం CNY 1,599 (సుమారు రూ. 19,000) నుండి ప్రారంభమవుతుంది. ఇంకా, 8GB + 256GB మరియు 12GB + 256GB RAM స్టోరేజ్ వేరియంట్‌ల ధర వరుసగా CNY 1,799 (దాదాపు రూ. 21,300) మరియు CNY 1,999 (దాదాపు రూ. 23,700) గా ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్ అజూర్, వార్మ్ సన్ గోల్డ్ మరియు మూన్ షాడో బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్లో మాత్రమే లాంచ్ అయినందున, వివో యొక్క చైనా ఇ-స్టోర్ ద్వారా ఏప్రిల్ 26న చైనాలో సేల్ కు రాబోతోంది.

వివో Y78 ప్లస్ 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు, ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల (1,080 x 2,400 పిక్సెల్‌లు) అమోలెడ్ డిస్‌ప్లేతో అమర్చబడింది. ఈ డిస్‌ప్లే గరిష్టంగా ప్రకాశం 1300 నిట్‌ల వరకు ఉంటుంది. ఇది ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ తో అమర్చబడింది, గరిష్టంగా 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.

ఇంకా, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13పై ఆధారపడిన OriginOS 3 పైన పనిచేస్తుంది. ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, వివో Y78 ప్లస్ 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో అమర్చబడింది. మరొక 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ లోని కనెక్టివిటీ ఎంపికలను గమనిస్తే, డ్యూయల్ సిమ్, 5G, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1 మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది 44W ఫ్లాష్ ఛార్జింగ్ కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. అదనంగా, ఇది బయోమెట్రిక్ కోసం ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది,దీనితో పాటు ముఖ గుర్తింపు ఫీచర్ కూడా ఉంది. వివో Y78 ప్లస్ 5G యొక్క డిజైన్ నిర్మాణం గమనిస్తే 164.24 × 74.79 × 7.89mm కొలతలతో ఉంటుంది. మరియు ఇది 177g బరువు కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Vivo Y78 Plus 5G with 50MP Camera, Snapdragon 695 SoC Processor Launched. Price,Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X