Just In
Don't Miss
- News
దిశ చట్టం.. కొత్త చట్టాలతో ఉపయోగం ఏంటి: వివేకా హత్య కేసులోనూ 21రోజల్లోనే చేయచ్చుగా: పవన్
- Sports
చెన్నైలో తొలి వన్డే.. మ్యాచ్‌కు వర్షం ముప్పు?!!
- Finance
ఆర్థిక మందగమనం: బడ్జెట్‌పై నిర్మలా సీతారామన కసరత్తు
- Movies
గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి : అది నా దురదృష్టం.. చిరు కన్నీటి వీడ్కోలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
Rs.1,500 ధర తగ్గింపుతో వివో ఫోన్లు!!! ఓ లుక్ వేయండి....
ఇండియాలో వివో Y91 మరియు వివో Y91i ఫోన్లకు ఇప్పుడు ధర తగ్గింపు లభించింది. ఈ రెండు ఫోన్ల ధరల మీద సుమారు రూ.1,500 వరకు తగ్గింపు పొందాయి. తగ్గింపు పొందిన తరువాత అవి ఇప్పుడు రూ.6,990 మరియు రూ.8,490ల వద్ద లభిస్తున్నాయి. ఇవి రెండు తగ్గింపు దరలతో ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తున్నాయి. ఈ ఫోన్ల యొక్క ముఖ్య లక్షణాలలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్, 6.22-అంగుళాల హెచ్డి + డిస్ప్లే మరియు మీడియాటెక్ హెలియో P22 SOC ఉన్నాయి.

తగ్గింపు ధరల వివరాలు
వివో Y91 సార్ట్ ఫోన్ యొక్క 2GB + 32 GB మోడల్ ఇంతకుముందు రూ.8,990 వద్ద అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఇది రూ. 8,490 ధర వద్ద లభిస్తున్నది. అంటే దీని మీద రూ.500 వరకు తగ్గింపు లభించింది. క్రొత్త ధర ఇప్పటివరకు ఆన్లైన్ సైట్లలో అందించడం లేదు కానీ త్వరలో కొత్త ధరతో అందించబడుతుంది. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, వివో ఇండియా ఇ-స్టోర్ వంటి వివిధ ఆన్లైన్ సైట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్ల మీద ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ధరల తగ్గింపును అందుకున్నట్లు ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికాం ధృవీకరించింది.

వివో Y91 i
వివో Y91 i యొక్క 2 జిబి ర్యామ్ + 32 జిబి మోడల్ ఇప్పుడు భారతదేశంలో రూ.6,990 ధర వద్ద లభిస్తున్నది. ఈ ఫోన్ ఇంతకు ముందు రూ. 7,490 ధరను కలిగి ఉండేది. అంటే ఈ మోడల్ మీద సుమారు రూ.1,500 వరకు ధర తగ్గింపును అందుకున్నది. ప్రస్తుతం ఇది ఆఫ్‌లైన్ స్టోర్లలో తగ్గింపు ధర వద్ద లభిస్తున్నది. అలాగే ఇది అమెజాన్.ఇన్‌తో పాటు వివో.కామ్‌లో కూడా తగ్గింపు ధరతో జాబితా చేయబడింది. అలాగే ప్రస్తుతం 2GB + 16GB మోడల్ ధరలో ఎటువంటి మార్పు లేదు.
OTP అవసరం లేకుండా paytmలో పెమెంట్స్

వివో Y91ఐ స్పెసిఫికేషన్స్
డ్యూయల్ సిమ్ -నానో సిమ్ కార్డ్ స్లాట్ గల వివో Y91 ఐ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఫన్‌టచ్ OS 4.5 ఆధారంగా రన్ అవుతుంది. 6.22-అంగుళాల HD + (1520x720 పిక్సెల్స్) ఇన్-సెల్ డిస్ప్లే 19: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో p 22 (ఎమ్‌టి 6762 ఆర్) SoC ఉండి అలాగే 2 జిబి ర్యామ్‌తో జత చేయబడి ఉంటుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం వివో Y91 ఐ వెనుకభాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో పాటు ఎఫ్ / 2.2 లెన్స్ మరియు ఎల్ఇడి ఫ్లాష్‌ను కలిగి ఉంది. అలాగే ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఎఫ్ / 1.8 లెన్స్ తో కూడి ఉంటుంది.
RS.7000 క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ లో తొలిసారి మోటో G8 ప్లస్ సేల్స్

వివో వై 91 ఐ స్మార్ట్ ఫోన్ 16 జిబి / 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మెమొరీని మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించడానికి అదనపు స్లాట్ కూడా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై, బ్లూటూత్ V 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎఫ్ఎం రేడియో, మైక్రో-యుఎస్బి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ లు ఉన్నాయి. ఇందులో గల సెన్సార్ల విషయానికి వస్తే యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్ (వర్చువల్), మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్లు ఉన్నాయి. వివో Y91i లో 4,030 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
ఈ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తుంటే వెంటనే మానేయండి

వివో Y91 స్పెసిఫికేషన్స్
వివో వై 91 స్మార్ట్ ఫోన్ యొక్క 3 జిబి ర్యామ్ వేరియంట్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఫన్‌టచ్ OS 4.5 తో రన్ అవుతుంది. ఇది 6.22-అంగుళాల HD + (720x1520 పిక్సెల్స్) హాలో ఫుల్ వ్యూ డిస్ప్లే 88.6 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిపి వస్తుంది. పవర్VRGE8320 GPU మరియు 3 జిబి ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P22 SoCతో కలిపి ఉంటుంది.
RS.299 యాడ్-ఆన్ ప్లాన్‌తో అపరిమిత డేటాను అందిస్తున్న ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్

ఆప్టిక్స్ పరంగా వివో వై 91 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఎఫ్ / 2.2 లెన్స్‌తో మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఎఫ్ / 2.4 లెన్స్‌తో కలిగి ఉంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా ఎఫ్ / 1.8 లెన్స్‌తో కలిగి ఉంటాయి. వివో వై 91 స్మార్ట్ ఫోన్ యొక్క 3 జిబి ర్యామ్ వేరియంట్ 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మెమొరీని మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించడానికి అదనపు స్లాట్ కూడా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై, బ్లూటూత్ V 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎఫ్ఎం రేడియో, మైక్రో-యుఎస్బి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ లు ఉన్నాయి. ఇందులో గల సెన్సార్ల విషయానికి వస్తే యాక్సిలెరోమీటర్,ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్ (వర్చువల్), మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్లు ఉన్నాయి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790