రూ.7,990 ధరకే కొత్త ఫోన్ ను లాంచ్ చేసిన వివో
చైనా మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ Vivo Y91i ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది .
చైనా మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ Vivo Y91i ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది . వివో వై సిరీస్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.తక్కువ ధరతో అధునాతన ఫీచర్లతో ఈ కొత్త ఫోన్ ను వివో లాంచ్ చేసింది . ఈ ఫోన్ ను వివో రెండు వేరియంట్లలో విడుదల మొదటిది 2జీబీ ర్యామ్ +16జీబీ స్టోరేజ్ వేరియంట్ కాగా రెండవది 2జీబీ ర్యామ్ +32జీబీ స్టోరేజ్ వేరియంట్.Vivo Y91i యొక్క ధర మరియు ఫీచర్లను ఒకసారి పరిశీలిస్తే

ధర
2జీబీ ర్యామ్ +16జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,990
2జీబీ ర్యామ్ +32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ..8,490

ఫీచర్లు...
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4030 ఎంఏహెచ్ బ్యాటరీ.

డిస్‌ప్లే
6.22 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1520×720 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

కెమెరా...
ఈ ఫోన్ వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరాలను ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేశారు.

ర్యామ్,స్టోరేజ్
ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 2జీబీ ర్యామ్,16,32జీబీ స్టోరేజ్లతో లభ్యమవుతోంది. FM radio, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 అదనపు ఆకర్షణలు.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ
ఈ Vivo Y91i స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో పై ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 4030 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications








