ఆకట్టుకునే ఫీచర్లతో ఇండియా మార్కెట్లో విడుదలైన Vivo Y95
చైనా మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ Vivo Y95 ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వివో వై సిరీస్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
చైనా మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ Vivo Y95 ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వివో వై సిరీస్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. స్టారీ నైట్ బ్లాక్, నెబ్యులా పర్పుల్ కలర్ వేరియెంట్లలో ఈ డివైస్‌ను కంపెనీ విడుదల చేసింది. దీని ధరను రూ.16,990గా నిర్ణయించింది.

ఫీచర్లు...
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 4030 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర...
ఈ ఫోన్ రూ.16,990 ధరకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం ఆన్‌లైన్ స్టోర్స్‌లో, వివో ఇండియా ఇ-స్టోర్స్‌లో లభిస్తున్నది.

డిస్‌ప్లే....
ఈ ఫోన్‌లో 6.22 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్‌ను ఇందులో అమర్చారు.

కెమెరా...
ఈ ఫోన్ వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరాలను ఉన్నాయి. ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4030 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు.

ఆఫర్స్....
ఈ ఫోన్‌పై నో కాస్ట్ EMI సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను కొన్న కస్టమర్లకు జియో రూ.4వేల విలువైన బెనిఫిట్స్‌ను, 3టీబీ డేటాను ఉచితంగా అందిస్తుంది .పేటీఎంలో కొనుగోలు చేస్తే రూ.1500 క్యాష్‌బ్యాక్ కూపన్ ఇస్తారు.


Click it and Unblock the Notifications