స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి దూసుకొస్తున్న వివో Z10

By Anil
|

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ 'వివో' తాజాగా ' వివో Z10' పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. అయితే ఈ ఫోన్ వివో V7 Plus రీబ్రాండెడ్ వెర్షన్‌గా మార్కెట్ లోకి విడుదల చేసింది.కాగా వివో V7 Plus 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో తో విడుదల కాగా వివో Z10 ను మాత్రం 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది .అయితే ఈ ఫోన్ ను దేశవ్యాప్తంగా కాకుండా సౌత్ ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే విడుదల చేసింది.

 

ధర :

ధర :

దీని ధరను కంపెనీ రూ. 14,990గా నిర్ణయించింది.అయితే ఈ స్మార్ట్ ఫోన్ ను దేశవ్యాప్తంగా కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,తమిళనాడు ,కర్నాటక రాష్ట్రాల్లో మాత్రమే విడుదల చేసారు.

ఫీచర్స్:

ఫీచర్స్:

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440x720 రిజల్యూషన్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3225 ఎంఏహెచ్ బ్యాటరీ.

కెమెరా విషయానికొస్తే:
 

కెమెరా విషయానికొస్తే:

ఈ స్మార్ట్ ఫోన్ లో కెమెరా హైలైట్ అని చెప్పుకోవచ్చు 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా తో పాటు ,24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో ఫోన్ లో ఫోటోలను చాలా బాగా తీసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ కాకుండా :

ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ కాకుండా :

అయితే ఈ స్మార్ట్ ఫోన్ ను ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ అప్‌డేట్ తో కాకుండా ఆండ్రాయిడ్ 8.0 Oreo అప్‌డేట్ విడుదల చెసింటే బాగుండేదని వివో అభిమానులు అనుకుంటున్నారు.

కాగా  వివో V7 Plus   ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి :

కాగా వివో V7 Plus ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి :

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1440x720 రిజల్యూషన్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3225 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Vivo Z10 goes official with 24MP selfie camera.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X