పెద్దలకు మాత్రమే..?

Posted By:

 పెద్దలకు మాత్రమే..?

 

మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ పుట్టకొస్తుంది.. దీనికి కారణం ఊహించని డిమాండ్.. ప్రస్తుత కుర్రకారు మోజంతా స్మార్ట్ ఫోన్‌ల పైనే..  సాధారణ హ్యాండ్ సెట్‌లను ఉపయోగించే వారిలో యువతతో పోలిస్తే పెద్దవారే ఎక్కువుగా ఉన్నట్లు ఓ సర్వే ద్వారా వెల్లడైంది.

ఈ నేపధ్యంలో వొడాఫోన్ సంస్థ పెద్ద వారికి మరింత అనువుగా ఉండేదుకు గాను సాధారణ మొబైల్ ఫోన్‌ను రూపొందించింది. ధర కేవలం రూ.1800. కాలింగ్ అదేవిధంగా సందేశాలు పంపుకునేందుకు ఈ మొబైల్ పూర్తి స్ధాయిలో దోహదపడుతుంది.

‘వొడిఫోన్ 155’ మోడల్లో  డిజైన్ కాబడిన ఈ ఫోన్ ఫీచర్లు:

*   బ్యాటరీ స్టాండ్ బై 29రోజులు,

*   టాక్ టైమ్ 600నిమిషాలు,

*   ఇంటర్నల్ మెమెరీ 0.3 ఎంబీ,

* 2జీ నెట్‌వర్క్ సపోర్ట్,

*   ఎస్‌వోఎస్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ వ్యవస్థ,

*   నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ,

*   హై వాల్యుమ్ రింగ్‌టోన్స్,

ఏంటీ SOS ఫీచర్..?

డివైజ్‌లో ఏర్పాటు చేసిన SOS అప్లికేషన్ వినియోగదారుడి భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. అత్యవసర సమయంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఉపయోగించుకునే విధానం: ఎమర్జన్సీ సమయంలో  వినియోగదారుడు ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన చిన్న బటన్ ప్రెస్ చేసి కొద్ది సేపు ఉంచాలి, తద్వారా అలర్ట్ సౌండ్  ఉత్పన్నమవుతుంది. అంతే కాదు సదురు వ్యక్తికి ఆప్తులైన నలుగురికి  సందేశం రూపంలో హెచ్చరికలు పంపుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting