ఫేస్‌బుక్ కోసం ప్రత్యేకంగా వోడాపోన్ 555 బ్లూ

By Super
|
Vodafone 555 Blue
ప్రపంచ వ్యాప్తంగా 700మిలియన్ యూజర్లను కలిగి ఉండి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో నెంబర్ వన్ స్దానంలో కొనసాగుతున్న ఫేస్‌బుక్ కోసం వోడాఫోన్ కంపెనీ ప్రత్యేకంగా వోడాఫోన్ ఫేస్‌బుక్ ఫోన్‌ని రూపోందించడం జరిగింది. ప్రపంచం వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ని ప్రతిరోజు 125 దేశాలనుండి 500 మంది యూజర్స్ ఉపయోగించడం జరుగుతుంది. అంతలా ఫేస్‌బుక్‌ని యూజర్స్ వాడడానికి కారణం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ కావడంతో పాటు ప్రపంచ జనాభా అవతలి వైపున్న వారి మైండ్‌లో ఏముందో తెలుసుకోవడానకి ఇదోక వారధిలాగా పనికి వస్తుందని అంటున్నారు.

ఫేస్‌బుక్లో ఉన్న జనాభా పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకుగాను వాడాఫోన్ 555 బ్లూ అనే మొబైల్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. అసలు ప్రస్తుతం ఫేస్‌బుక్ ఊపు ఎలా ఉందంటే ప్రపంచంలో ఉన్న మొబైల్ ఫోన్స్ బ్రౌజర్స్‌లలో మొట్టమొదట ఓపెన్ చేసేటటువంటి వెబ్ సైట్ ఫేస్‌బుక్ కావడం గమనార్హం. ఫేస్‌బుక్ ఎకౌంట్స్‌ని యూజర్స్ ఎల్లప్పుడూ వారియొక్క మొబైల్ ఫోన్స్‌లో కనెక్ట్ అయ్యే ఉంటున్నారు. దీనిని బట్టి చూస్తుంటే ఫేస్‌బుక్‌కి ఎంత క్రేజి ఉందో అర్దమైపోతుంది. కొంత మంది మొబైల్ తయూరీదారులు ఫేస్‌బుక్ బటన్‌ని ఒకే ఒక్క టచ్‌తో సైట్‌లోకి వెళ్శే విధంగా మొబైల్ ఫోన్స్‌లో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది.

 

ప్రపంచంలోనే అతి పెద్దదైన టెలికామ్ సర్వీస్ ప్రోవైడర్ వోడాఫోన్ లండన్‌‍‌లో ఫేస్‌బుక్ కోసం వోడాపోన్ 555 బ్లూని విడుదల చేసింది. మొట్టమొదట ఈ మొబైల్‌ని లండన్‌లో విడుదల చేయడానికి గల కారణం ఆసియా మార్కెట్స్ అయిన ఇండియా, చైనా కంటే కూడా ఇది లండన్‌లో బిగ్ సక్సెస్‌ని సాధిస్తుందనే నమ్మకంతోనే మొదట అక్కడ విడుదల చేయడం జరిగిందని వెల్లడించారు. ఇక వోడాఫోన్ 555 బ్లూ మొబైల్ రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లలో లభిస్తుంది. మొదటిది వోడాఫోన్ జావా ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ కాగా, రెండవది వేరే దేశాలలో మార్కెటింగ్‌కి అనుకూలంగా ఉండేందుకు గాను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడా రూపోందించడం జరిగింది.

 

వోడాఫోన్ 555 బ్లూ మొబైల్‌ని తయారు చేసిన వారు టిసిఎల్ కంపెనీ. ఈ మొబైల్ EDGE టెక్నాలజీ ద్వారానే ఇంటర్నెట్ యాక్సెస్‌ని అందించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ మొబైల్ వై-పై ఇంటర్నెట్ కనెక్టివీటీ, 3జిని కూడా సపోర్ట్ చేయదు. ఇక కెమెరా విషయానికి వస్తే 2 మెగాఫిక్సల్ కెమెరాని కలిగి ఉంటుంది. ఇంటర్నెల్‌గా మొమొరీ తక్కువగా ఉన్నప్పటికీ మైక్రో ఎస్‌డి స్టాట్ ద్వారా మొమొరీని ఎక్సాండ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కీప్యాడ్ విషయానికి వస్తే క్వర్టీ కీప్యాడ్‌తో పాటు, యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరీయన్స్‌ని కలిగించేందుకు 2.8 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంది.

హెచ్‌టిసి చాచా మాదిరే వోడాఫోన్ 555 బ్లూ మొబైల్‌కి కూడా ప్రత్యేకంగా ఫేస్‌బుక్ బటన్‌ని అమర్చడం జరిగింది. ఇండియాలో త్వరలో విడుదల కానున్న వోడాఫోన్ 555 బ్లూ ఖరీదు కూడా సుమారు నాలుగు వేలకు తక్కువగానే లభించనుందని నిపుణులు భావిస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X