వోడాఫోన్ బడ్జెట్ ఫోన్ సింప్లీ సూపర్బ్....

Posted By: Super

వోడాఫోన్ బడ్జెట్ ఫోన్ సింప్లీ సూపర్బ్....

టెలికమ్ నెట్ వర్కింగ్ సర్వీసెస్‌ని అందించడంలో వోడాఫోన్ మనకు బాగా సుపరిచితం ఉన్న పేరు. వోడాఫోన్ కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా ఇప్పడు మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయనుంది. వోడాఫోన్ గతంలో కేవలం సిమ్స్‌ని మొబైల్ ఫోన్స్‌లలో ఇమడింపచేసి చిన్న మొత్తంలో బిజినెస్‌ని ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు వోడాఫోన్ సొంతంగా తన బ్రాండ్ మీద మొబైల్ ఫోన్స్‌ని తయారు చేసి వోడాఫోన్ సిమ్స్‌ని ఆ మొబైల్ ఫోన్స్‌తో పాటు విడుదల చేయనుంది. దీనికి తగిన విధి విధానాలను వోడాఫోన్ కంపెనీ ఇప్పటికే రూపోందించడం జరిగింది.

వోడాఫోన్ త్వరలో విడుదల చేయనున్న స్మార్ట్ పోన్‌కి సంబంధించి ఫీచర్స్ ఇప్పటికే మార్కెట్లో హాల్ చల్ చేస్తున్నాయి. 2.8 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో పాటు, ఆండ్రాయిడ్ వర్సన్ 2.2ని ఆపరేటింగ్ సిస్టమ్‌గా రూపోందించడం జరిగింది. ఆండ్రాయిడ్ వర్సన్ 2.2తో రన్ అయ్యేటటువంటి ఈ స్మార్ట్ పోన్‌ని హువాయ్ కంపెనీ పర్యవేక్షణలో సిద్దం అవుతుంది. ఈ ఫోన్‌ని ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి స్మార్ట్ అనే పేరుతో విడుదల చేయనున్నారు. 2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడం వల్ల యాజర్స్ చక్కని ఇమేజిల ను తీసుకునే అవకాశం ఉంది. మల్టీ టాస్కింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు గాను ఇందులో 528 MHz ARM ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. వీటితో పాటు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ రన్ అయ్యేందుకు గాను Adreno 200 Graphics Processing Unit (GPU)ని నిక్షిప్తం చేశారు.

వోఢాఫోన్ విడుదల చేయనున్న ఈ డివైజ్ 3జీ టెక్నాలజీకి కూడా ఉపయోగపడుతుంది. మొబైల్‌తో పాటు 130ఎమ్‌బి మొమొరీ లభిస్తుండగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 32జిబి వరకు మొమొరీని విస్తరించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పై లను సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌తో పాటు కొన్ని కస్టమ్ అప్లికేషన్స్ కూడా ఇందులో ఇమడింపజేయడం జరిగింది. ఇక బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికి వస్తే స్టాండర్డ్ టాక్ టైమ్ 2జీ నెట్ వర్క్‌కి 250 గంటలు వస్తుంది. మార్కెట్లో వోఢాఫోన్ మొబైల్ నలుపు, తెలుపు రెండు కలర్స్ లలో లభ్యమవుతుంది. ఈ వోఢాఫోన్ బడ్జెట్ స్మార్ట్ పోన్ ఖరీదు మార్కెట్లో సుమారుగా రూ 6,999గా ఉండవచ్చునని నిపుణుల అంచనా..

ఇది మాత్రమే కాకుండా వోఢాఫోన్ ఈ సంవత్సరం జూన్ నెలలో ఆండ్రాయిడ్ క్వర్టీ డివైజ్(వెబ్ బాక్స్)ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డివైజ్‌ని మొట్టమొదట డెవలప్ చేసింది హార్యానాలోని పైలెట్ ప్రాజెక్టు కోసం అన్న సంగతి తెలిసిందే. ఈ డివైజ్‌ లో ఆర్డినరి టెలివిజన్‌ని కూడా చూడోచ్చు. దీని ఖరీదు సుమారుగా రూ 5,799 ఉండవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot