వొడాఫోన్ నుంచి అత్యంత తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్ !

Written By:

రిల‌య‌న్స్ జియో ఫీచ‌ర్ ఫోన్ ధాటిని త‌ట్టుకోవ‌డానికి ఇత‌ర టెలికాం నెట్‌వ‌ర్క్‌లు త‌క్కువ ధ‌ర గ‌ల స్మార్ట్‌ఫోన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా వొడాఫోన్‌, ఐటెల్‌ భాగస్వామ్యంలో కొత్తగా ఓ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఏ20 పేరుతో ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని త‌యారీ కోసం చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఐటెల్ మొబైల్‌తో ఒప్పందం చేసుకుంది.

శాంసంగ్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 3,690 డౌన్ పేమెంట్

ఒప్పందం ప్ర‌కారం ముందు వినియోగ‌దారుడు ఈ ఫోన్‌ను రూ. 3,690 డౌన్ పేమెంట్ చెల్లించి కొనుక్కోవాలి. ఇందులో రూ.2100 క్యాష్‌బ్యాక్‌ను వొడాఫోన్‌ ఆఫర్‌చేస్తోంది. అది పోగా కేవలం రూ.1,590కే ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.

రూ.150 ఆపైన విలువ గల ప్లాన్‌ను

అనంతరం నెలకు రూ.150 ఆపైన విలువ గల ప్లాన్‌ను 36 నెలల పాటు వాడాలి. దీంతో వినియోగదారులకు మొదటి 18 నెలల తరువాత రూ.900, 36 నెలల తరువాత మరో రూ.1200 క్యాష్ బ్యాక్ వస్తుంది.

రూ.2100 వినియోగదారులకు వెనక్కి..

దీంతో మొత్తం రూ.2100 వినియోగదారులకు వెనక్కి వస్తాయి. యూజర్లు ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని ఎం-పైసా వాలెట్లలో పొందుతారని వొడాఫోన్‌ పేర్కొంది.

ఏ20 ఫీచ‌ర్లు

4 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 1700 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone Launches Itel A20 Smartphone at an 'Effective Price' of Rs. 1,590 Read More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot