ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వొడాఫోన్ బంపర్ టారిఫ్!!

Posted By: Prashanth

ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వొడాఫోన్ బంపర్ టారిఫ్!!

 

రాష్ట్ర చందాదారుల కోసం వొడాఫోన్ బంపర్ టారిఫ్ ను అందుదుబాటులోకి తెచ్చింది. ఎఫ్‌ఆర్‌సీ11, ఎఫ్‌ఆర్‌సీ57 పేరుతో రెండు రీచార్జ్ ప్లాన్లను ఈ లీడింగ్ టెలికం ప్రొవైడర్ ప్రవేశపెట్టింది. ఎఫ్‌ఆర్‌సీ11 కింద రూ.11తో తొలి రీచార్జ్, రూ.19తో రెండో రీచార్జ్ చేయిస్తే రూ. 60 విలువ చేసే టాక్‌టైమ్ లభిస్తుంది. నాలుగు నెలల పాటు (ప్రతి నెలా రూ. 15) ఇది వర్తిస్తుంది. అలాగే, 15 రోజుల పాటు 50 లోకల్/నేషనల్ ఎస్‌ఎంఎస్‌లు వినియోగించుకోవచ్చు. మరోవైపు, ఎఫ్‌ఆర్‌సీ57 కింద రూ. 57తో తొలి రీచార్జ్, రూ.3తో మలి రీచార్జ్ చేయిస్తే రూ.60 విలువ చేసే టాక్‌టైమ్ లభిస్తుంది. 3 నెలల పాటు (నెలకు రూ. 20) ఇది వర్తిస్తుంది. లోకల్ కాల్స్‌కి రెండు సెకన్లకు 1 పైసా చొప్పున ప్రత్యేక టారిఫ్ ఉంటుంది.

కోల్‌కతాలో 4జీ సేవలు ప్రారంభం!!

దేశంలోనే ప్రధమంగా 4జీ ఆధారిత బ్రాడ్‌బాండ్ వైర్‌లెస్ యాక్సెస్ (బిడబ్ల్యుఏ) సేవలను మంగళవారం భారతి ఎయిర్‌టెల్ కోల్‌కతాలో లాంఛ్ చేసింది. కేంద్ర కమ్యునికేషన్ల మంత్రి కపిల్ సిబల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై హైస్పీడ్ సర్వీసును ప్రారంభించారు. దీంతో దేశంలో 4జి సేవలు ప్రారంభించిన తొలి టెలికాం ఆపరేటర్‌గా భారతి ఎయిర్‌టెల్ చరిత్రకెక్కింది. 2జీ, 3జీల తర్వాత వస్తున్న 4జీ సర్వీసు 3జీ సేవల కన్నా పదిరెట్లు వేగవంతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot