వొడాఫోన్ రంజాన్ ఆఫర్లు!

Posted By: Staff

వొడాఫోన్ రంజాన్ ఆఫర్లు!

హైదరాబాద్: రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని తన ప్రీపెయిడ్ కస్టమర్లకు వొడాఫోన్ సరికొత్త ఆఫర్లను తీసుకువచ్చింది. 786 రూపాయల టాప్అప్‌పై పూర్తి టాక్‌టైమ్‌తో పాటు 78 రూపాయల ఇ-టాప్ రీచార్జ్‌పై 78600 నైట్ సెకండ్లు, 54 రూపాయల ఇ-టాప్‌పై 47160 సెకండ్ల నైట్ టాక్‌టైమ్ ( రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు)ను అందిస్తోంది. వీటి కాల పరిమితి నాలుగు వారాలని వొడాఫోన్ తెలిపింది. 121 నంబర్‌కు డయల్ చేయడం ద్వారా కానీ *121# డయల్ ద్వారా ఉచితంగా ఖురాన్ అలర్ట్‌లను పొందవచ్చని పేర్కొంది. 786 రూపాయల రీచార్జ్ ద్వారా సెకనుకు 11 పైసలతో గల్ఫ్‌కు ఫోన్ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నట్టు తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot