నోకియా ఫోన్‌ల పై బంపరాఫర్

నోకియా మొబైల్స్ కొత్త ఓనర్ అయిన హెచ్‌ఎండి గ్లోబల్‌తో వొడాఫోన్ ఇండియా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా నోకియా 6, నోకియా 5, నోకియా 3 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‌లను కొనుగోలు చేసే ఇండియన్ యూజర్లకు 30జీబి వరకు ఉచిత 4జీ డేటాను వొడాఫోన్ ఇవ్వనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 5, నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌‌లను కొనుగోలు చేసే యూజర్లకు...

ఈ ఆఫర్‌లో భాగంగా నోకియా 5, నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌‌లను కొనుగోలు చేసే యూజర్లు నెలకు రూ.142 చెల్లించి 1జీబి 4జీ డేటాను కొనుగోలు చేసినట్లయితే అదనంగా 4జీబి డేటా వారి అకౌంట్‌లో యాడ్ అవుతుంది.ఇలా మూడు నెలల పాటు ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌‌లను కొనుగోలు చేసే యూజర్లకు...

నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌‌లను కొనుగోలు చేసే యూజర్లు నెలకు రూ.251 చెల్లించి 1జీబి 4జీ డేటాను కొనుగోలు చేసినట్లయి అదనంగా 9జీబి డేటా వారి అకౌంట్‌లో యాడ్ అవుతుంది. ఇలా మూడు నెలల పాటు ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. వొడాఫోన్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు సైతం ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే వీరు కనీసం 1జీబి రెంటల్ ప్లాన్‌ను ముందుగా యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది.

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 5 స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

నోకియా 3 స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone to Offer Up to 30GB Free 4G Data for Nokia 6, Nokia 5, and Nokia 3 Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot