పోస్ట్‌పెయిడ్ ఖాతాదారుల కోసం ‘వొడాఫోన్ రెడ్’

Posted By:

ప్రముఖ మొబైల్ టెలికామ్ ఆపరేటర్ వొడాఫోన్ తమ పోస్ట్‌పెయిడ్ ఇంకా ఎంటర్‌ప్రైజ్ ఖాతాదారుల కనెక్షన్ల సంఖ్యను మరింత పెంచుకునేందుకు ‘వొడాఫోన్ రెడ్', ‘వొడాఫోన్ రెడ్‌ఫర్ బిజినెస్' పేర్లతో సరికొత్త ఆల్ ఇన్ వన్ పథకాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వొడాఫోన్ రెడ్ ప్లాన్‌లో భాగంగా కుటుంబ సభ్యులు కాల్స్ ఇంకా డేటాను షేర్ చేసుకోవచ్చు.

పోస్ట్‌పెయిడ్ ఖాతాదారుల కోసం ‘వొడాఫోన్ రెడ్’

వొడాఫోన్ రెడ్ పథకాలను పరిశీలించినట్లయితే... రూ.499 చెల్లింపు పై 1000 నిమిషాల కాల్స్, 500 ఎంబీ డేటాతో పాటు 500 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. రూ.899 అద్దె చెల్లింపు పై 2000 నిమిషాల కాల్స్ తో పాటు 5జీబి డేటా అలానే 2000 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. రూ.1299 అద్దె చెల్లింపు పై 4000 నిమిషాల కాల్స్, 5జీబి డేటా, 2000 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. రూ.1599 అద్దె చెల్లింపు పై 6000 నిమిషాల కాల్స్, 5జీబి  డేటా, 2000 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఇద్దరు వేరువేరు పథకాలను తీసుకున్నప్పుడు, ఒకరి వద్ద మిగిలిన కాల్స్ నిమిషాలను, డేటాను మరొకరు వినియోగించుకోవచ్చు.

వొడాఫోన్ రెడ్‌ఫర్ బిజినెస్ పథకాలను పరిశీలించినట్లయితే... సంస్థల్లో పనిచేసే వారికోసం సీయూజీ (కామన్ యూజర్ గ్రూప్) పథకాల్లో భాగంగా రూ.666, రూ.999, రూ.1599 పథకాలను వొడాఫోన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Vodafone RED All-in-One with Voice, Data and SMS Launched. Read more in Telugu Gizbot.......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot