‘హిట్’ వేటలో వొడాఫోన్, ‘సక్సెస్’ రూట్‌లో మైక్రో‌మ్యాక్స్...?

Posted By: Prashanth

‘హిట్’ వేటలో వొడాఫోన్, ‘సక్సెస్’ రూట్‌లో మైక్రో‌మ్యాక్స్...?

 

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంటర్ అయిన ‘వొడాఫోన్’ ఇప్పటి వరుకు సరైన హిట్ అందుకోలేకపోయింది. ఇతర మొబైల్ తయారీదారులతో పోలిస్తే మన్నికైన డివైజ్‌లను ఉత్పత్తి చేయ్యకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరో బ్రాండ్ మైక్రోమ్యాక్స్ సమజంసమైన ధరలకే మన్నికైన మొబైల్‌ఫోన్‌లను అందిస్తూ సక్సెస్ రూట్‌లో దూసుకుపోతుంది.

హిట్ కోసం పరితపిస్తున్న వొడాఫోన్ తాజాగా ‘వొడాఫోన్ స్మార్ట్’ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే మధ్యతరగతి మొబైల్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘మైక్రోమ్యాక్స్’ తన పరిధిని మరింత విస్తరించుకునే క్రమంలో ‘A75’ వేరియంట్‌తో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

‘వొడాఫోన్ స్మార్ట్’ ముఖ్య ఫీచర్లు:

* QVGA TFT టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, * గుగూల్ ఆండ్రాయిడ్ v2.2.1 ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం, * క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎస్1 మొబైల్ ప్రాసెసర్, * అడ్రినో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, * 3జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ, * జీపీఆర్ఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ, * వై-ఫై కనెక్టువిటీ, * బ్లూటూత్, * 2 మెగా పిక్సల్ కెమెరా, * మల్టీ మీడియా ప్లేయర్, * మొబైల్ టీవీ అప్లికేషన్స్, * 5 గంటల టాక్ టైమ్ నిచ్చే బ్యాటరీ, ధర రూ.5,000.

మైక్రోమ్యాక్స్ A75 కీలక ఫీచర్లు:

* టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, * డ్యూయల్ సిమ్ సపోర్ట్, * గుగూల్ ఆండ్రాయిడ్ v2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 650 MHz ప్రాసెసర్, * 3జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ, * జీపీఆర్ఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ, * వై-ఫై సపోర్ట్, * బ్లూటూత్, * 3.15 మెగా పిక్సల్ కెమెరా, * వీజీఏ సెకండరీ కెమెరా, * వెబ్ బ్రౌజర్, * ఎఫ్ఎమ్ రేడియో, * ఇన్‌బుల్ట్ గుగూల్ అప్లికేషన్స్, * బ్యాటరీ టాక్ టైమ్ 5 గంటలు, ధర రూ.8,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot