అన్ని చోట్టా స్వీప్ చేస్తుందా..?

Posted By: Super

అన్ని చోట్టా స్వీప్ చేస్తుందా..?

 

యూకే మొబైల్ మార్కెట్‌ను స్వీప్ చేసేందుకు  వొడాఫోన్ ‘స్మార్ట్ II’ పేరుతో ఆండ్రాయిడ్ ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు ప్రతిపాదించిన పేరు ‘స్మార్ట్’ స్లైల్ ఇంకా పోర్టబులిటీకి సూచికగా నిలుస్తుంది. సాలిడ్ డిజైనింగ్ యూజర్‌ను కట్టిపడేస్తుంది. కేవలం ఒక్క ఫ్లిప్‌తో కాల్స్‌ను మ్యూట్‌లోకి వెళ్టిపోతాయి.

ఆండ్రాయిడ్ ఆధారితంగా రన్ అయ్యే ఈ డివైజ్ 3.2 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. 800మెగాహెడ్జ్ సామర్ధ్యంగల ప్రాసెసర్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. నాజూకైన గులకరాయి ఆకృతిలో  తీర్చిదిద్దబడిన ఈ మొబైల్ ధర రూ.7,000లోపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టచ్ స్ర్కీన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. పరికరాన్ని మరింత విశేషాలతో ముస్తాబు చేసే క్రమంలో ‘వచ్చే కాల్స్‌ను ఒక్క ఫ్లిప్‌తో మ్యూట్ చేసే‘ఫీచర్‌ను నిక్షిప్తం చేశారు. స్మార్ట్‌ఫోన్ వినియోగంలో ఆరంభ దశలో ఉన్నవారు సులువుగా ఆపరేట్ చేసుకునేందుకు గాను అనేక అప్లికేషన్‌లను ముందుగానే ఇన్స్‌టాల్ చేశారు.

ఆసంతృప్తికి లోనుచేసే అంశాలు:

- ప్రాసెసర్ తక్కువ సామర్ధ్యాన్ని కలిగి ఉండటంతో  బ్రౌజింగ్ ఊహించిన స్థాయిలో ఉండదు.

- స్ర్కీన్ డిస్ ప్లే స్వల్ప ఆసౌకర్యానికి లోను చేస్తుంది.

అనుకూలమైన అంశాలు:

- స్మార్ట్ డిజైనింగ్,

- తక్కువ ధర,

- ఆండ్రాయిడ్ మొబైలింగ్,

- వొడాఫోన్ బ్రాండ్.

యూకేలోని అనేక ప్రాంతాల్లో  విడుదలకాబోతున్న ‘వొడాఫోన్ స్మార్ట్ II’ మార్కెట్ ను ఏ మేరకు స్వీప్ చేస్తుందో వేచి చూడాలి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot