OnePlus 6 కెమెరాలో స్పెషల్ ఫీచర్స్ ఏంటీ ?

ప్రపంచాన్ని స్మార్ట్‌ఫోన్లు శాసిస్తున్న నేటి తరుణంలో కెమెరా ఫోన్లకు ప్రాధాన్యం ఏర్పడింది. గత కొద్ది సంవత్సరాల నుంచి ఫోన్ కెమెరాలకు సంబంధించి అనేక రకాలుగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

|

ప్రపంచాన్ని స్మార్ట్‌ఫోన్లు శాసిస్తున్న నేటి తరుణంలో కెమెరా ఫోన్లకు ప్రాధాన్యం ఏర్పడింది. గత కొద్ది సంవత్సరాల నుంచి ఫోన్ కెమెరాలకు సంబంధించి అనేక రకాలుగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన అన్ని కెమెరా స్మార్ట్ ఫోన్లు యూజర్లను అమితంగా కట్టిపడేసాయి. ఎక్కడికైనా వెళ్లినప్పుడు అక్కడ పరిసరాలను ఫోటోలు తీయడం వీలైతే సెల్ఫీలు దిగడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ఇక వీడియోలు సంగతి చెప్పనే అక్కరలేదు. అయితే ఇప్పుడు Vogue's latest edition కవర్ పేజీలో కెమెరా ఫోన్ల గురించి ఫోటోతో సహా ప్రస్తావించారు. మరి అందులో ఏ ఫోన్ గురించి ప్రస్తావించారు అనే విషయాన్ని ఆరాతీస్తే అది OnePlus 6కి సంబంధించినదిగా తేలింది. ఓ మొబైల్ గురించి మ్యాగజైన్ మెయిన్ పేజీలో ప్రచురించడమనేది దేశంలో ఇదే తొలిసారి.

కాల్‌డ్రాప్స్ సమస్యకు చెక్, ఇకపై టెలిఫోనీ యాప్ ఉంటే చాలు !కాల్‌డ్రాప్స్ సమస్యకు చెక్, ఇకపై టెలిఫోనీ యాప్ ఉంటే చాలు !

కెమెరాతో కొన్ని అద్బుతాలను..

కెమెరాతో కొన్ని అద్బుతాలను..

ఫ్యాషన్, ఫోర్టెయిట్ ఫోటోగ్రాఫర్ ErrikosAndreou వన్‌ప్లస్ 6 కెమెరాతో కొన్ని అద్బుతాలను అందించాడు. వన్‌ప్లస్ 6 తో బాలీవుడ్ హీరోయిన్ ఆదితి రావు హైదరితో ఫోటో షూట్ నిర్వహించారు. ఇప్పుడు ఆ ఫోటోనే మ్యాగజైన్లో కవర్ పేజీగా ప్రచురితమైంది. ఈ ఫోటోలో ఆదితిరావుని చూసిన వారందరూ ఫిదా అయిపోతున్నారు.

ముంబైలో షూట్

కాగా ఈ ఫోటోను ఫోటోగ్రాపర్ ముంబైలో షూట్ చేశారు. వన్‌ప్లస్ 6 ద్వారా షూట్ చేసిన ఈ ఫోటోలో ఆ ఫోన్ కి సంబంధించి కెమెరా కలర్స్ ఎలా ఉండబోతున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. white, blue, and hues of yellow and pink లాంటి రంగులు ఈ కెమెరా ద్వారా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వెనుక ఎటువంటి అంచులు కనపడకుండా ఈఫోటో కవర్ చేస్తోంది. అంటే కెమెరాలో ఏదో కొత్తదనం ఉందని చెప్పకనే చెబుతోంది.

ఫస్ట్ టైం కెమెరాతో ఇంతటి అద్భుత ఫోటో..
 

ఫస్ట్ టైం కెమెరాతో ఇంతటి అద్భుత ఫోటో..

కాగా ఈ ఫోటోగ్రాపర్ ఇప్పటికే చాలామంది హీరోయిన్ల ఫోటోలను ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం షూట్ చేశారు. ఇందులో దీపికా పదుకునే , కరీనాకపూర్ లాంటి అందాల తారలు ఉన్నారు. అయితే వీళ్లందరికన్నా ఆదితి రావుని తీసిన షూట్ తనకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని ఫస్ట్ టైం కెమెరాతో ఇంతటి అద్భుత ఫోటోని షూట్ చేశానని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్ లో కన్వినెంట్ సైజుతో ఫోటోను తీసుకునే విధానం ఉండటం నాకు చాలా ఉపయోగకరంగా మారిందని తెలిపారు.

వెలుతురు అంతగా లేని ప్రదేశాల్లో కూడా..

వెలుతురు అంతగా లేని ప్రదేశాల్లో కూడా..

వెలుతురు అంతగా లేని ప్రదేశాల్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉపయోగించి ఫ్రోపెషనల్ షాట్లు తీయడం ఈ ఫోన్ కెమెరాలో ఉన్న ప్రత్యేకత అని తెలిపారు. షాట్ తీసుకునే ముందు వన్‌ప్లస్ 6 కెమెరాలో పొందుపరిచిన FHD+ display బాగా సాయం చేస్తుందని తెలిపారు. కాగా ఈ ఫోన్ కెమెరా మీద మక్కువ పెంచుకున్న ఈ ఫోటోగ్రాపర్ కంపెనీకి వన్‌ప్లస్ 6లో ప్రొ మోడ్ గురించి సమాచారాన్ని ఇచ్చారు. రా ఫార్మాట్ లో కూడా తీసుకునే విధంగా కెమెరా ఉందని ఈ ప్రొపెషనల్ ఫోటోగ్రాపర్ తెలిపారు. ఈ ఫోన్ కెమెరాలో మరింత మెరుగుదల కోసం కొన్ని మార్పులను స్వాగతిస్తుందని తెలిపారు. light, warmth, brightness, contrast, colour,లాంటి వాటితో ఫోటోలను మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు.

8 GB of RAMతో

8 GB of RAMతో

Vogue's latest edition కవర్ పేజీలో వచ్చిన ఫోటోని చూస్తే త్వరలో రానున్న వన్‌ప్లస్ 6 కెమెరా సెగ్మెంట్లో సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయనుందని తెలుస్తోంది. మంచి పెర్మాఫెర్మెన్స్ కెమెరా ఫోన్లలో వన్‌ప్లస్ 6 మంచి ప్రతిభ కనబరిచి ఇతర ఫోన్లను వెనక్కి నెట్టేయగలదని తెలుస్తోంది. Snapdragon 845 SoCతో పాటు 8 GB of RAMతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. కాగా ఈఫోన్ ఈ నెల 17న లాంచ్ కానుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే అప్పటిదాకా ఎదురుచూడక తప్పుదు.

Best Mobiles in India

English summary
Vogue’s May cover shows what the OnePlus 6 camera can achieve More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X