4G VoLTE వల్ల లాభాలు, నష్టాలు

సాధారణ నెట్‌వర్క్‌లలో కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు మొబైల్ డేటా డిస్కనెక్ట్ అయిపోతుంటుంది. VoLTE కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఇటువంటి సమస్యే ఉండదు.

|

మార్కెట్లోకి రిలయన్స్ జియో రాకతో ఒక్కసారిగా 4G VoLTE (వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఇవల్యూషన్) సపోర్ట్ ఫోన్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. హై-స్పీడ్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలలో ఒకటైన VoLTE, స్మార్ట్‌ఫోన్‌ కమ్యూనికేషన్‌‌ను సరికొత్త లెవల్‌కు తీసుకువెళ్లింది.

Read More : 4 నిమిషాల్లో 2,50,00 ఫోన్‌లు, Redmi 4A అమ్మకాల సునామీ

అన్ని స్మార్ట్‌ఫోన్లలో 4G VoLTE

అన్ని స్మార్ట్‌ఫోన్లలో 4G VoLTE

ప్రస్తుత ట్రెండ్‌ను అంచనా వేసినట్లయితే దాదాపుగా అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు 4G VoLTE ఫీచర్‌ను తమ ఫోన్‌లతో అందిస్తున్నాయి. 4G VoLTE కమ్యూనికేషన్‌కు అంతకంతకు డిమాండ్ పెరుగుతుండటంతో బేసిక్ ఫోన్ లలోనూ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేస్తున్నాయి.

 

 

4జీ LTE బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్..

4జీ LTE బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్..

వాస్తవానికి, వాయిస్ ఓవర్ ఎల్టీఈ అనేది ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు మరొక మార్గం. VoLTE కాల్స్ అనేవి స్టాండర్డ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా కాకుండా మొబైల్ 4జీ LTE బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ద్వారా డెలివరీ కాబడతాయి.

 VoLTE సపోర్టెడ్ ఫోన్ తప్పనిసరి..

VoLTE సపోర్టెడ్ ఫోన్ తప్పనిసరి..

VoLTE కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లయితే తప్పనిసరిగా మీ వద్ద VoLTE సపోర్టెడ్ ఫోన్ అలానే నెట్ వర్క్ అందుబాటులో ఉండాలి. VoLTE కమ్యూనికేషన్ టెక్నాలజీను ఉపయోగించుకోవటం వల్ల చేకూరే లాభాలు అలానే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హెచ్‌డి వాయిస్ కాల్ సదుపాయం

హెచ్‌డి వాయిస్ కాల్ సదుపాయం

VoLTE కమ్యూనికేషన్ స్టాండర్డ్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే హైడెఫినిషన్స్ వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్.. 4జీ సర్వీస్ ద్వారా హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

వీడియో కాలింగ్..

వీడియో కాలింగ్..

VoLTE కమ్యూనికేషన్ స్టాండర్డ్, నేటివ్ వీడియో కాలింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. వీడియో సర్వీసులను ఆఫర్ చేసే క్రమంలో VoLTE కమ్యూనికేషన్ టెక్నాలజీ H.264 అని పిలవబడే హైడెఫినిషన్ వీడియో కోడిక్‌ను ఉపయోగించుకుంటుంది. దీంతో ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌లలో వీడియో కాలింగ్ సర్వీసులను కూడా ఆఫర్ చేయవచ్చు.

అంతరాయంలేని పనితీరు

అంతరాయంలేని పనితీరు

సాధారణ నెట్‌వర్క్‌లలో కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు మొబైల్ డేటా డిస్కనెక్ట్ అయిపోతుంటుంది. VoLTE కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఇటువంటి సమస్యే ఉండదు. వాయిస్ కాల్స్ అలానే డేటా వర్క్‌ను ఒకేసారి నిర్వహించుకోవచ్చు. 4జీ VoLTE నెట్‌వర్క్‌లో కాల్స్ చేస్తూనే ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చు.

జియో ప్రైమ్ ఉచితం.. అలా చేయండి, ఇలా తీసుకోండిజియో ప్రైమ్ ఉచితం.. అలా చేయండి, ఇలా తీసుకోండి

చెప్పేది ఒకటి, అమ్మేది ఒకటి

చెప్పేది ఒకటి, అమ్మేది ఒకటి

ప్రస్తుతానికి, మార్కెట్లో లభ్యమవుతోన్న కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే VoLTE కమ్యూనికేషన్ స్టాండర్డ్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. మొబైల్ దుకాణాల్లో VoLTE అని చెప్పి సాధారణ 4జీ ఫోన్లను అంటగడుతున్నారు. కాబట్టి, 4జీ VoLTE ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు ఆ ఫోన్ VoLTE సపోర్ట్ ఉందా, లేదా అనేది నిర్ధారించుకోండి.

 

VoLTE checker

VoLTE checker

4జీ VoLTE సపోర్ట్‌ను తమ డివైస్‌ల‌లో గుర్తించ‌డం చాలా మందికి క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. అందుకే గూగుల్ ప్లే స్టోర్‌లో అలాంటి వారి కోసం ఓ యాప్ అందుబాటులోకి వ‌చ్చింది. 'VoLTE checker' పేరిట ప్లే స్టోర్‌లో ల‌భ్య‌మ‌వుతున్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఇన్‌స్టాల్ చేసుకుని తమ ఫోన్ 4జీ VoLTEను సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు.

 

బ్యాటరీ లైఫ్‌ను సగానికి పై ఖర్చు..

బ్యాటరీ లైఫ్‌ను సగానికి పై ఖర్చు..

VoLTE ఫీచర్‌తో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు బ్యాటరీ లైఫ్‌ను సగానికి పై ఖర్చు చేస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. దీంతో రోజంతా రావల్సిన బ్యాటరీ ఒక పూటకే అయిపోతుందట. కాబట్టి, VoLTE కమ్యూనికేషన్ స్టాండర్డ్ వల్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లకు లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.

నోకియా కొత్త ఫోన్ విడుదలైంది, ధర రూ.1950నోకియా కొత్త ఫోన్ విడుదలైంది, ధర రూ.1950

Best Mobiles in India

English summary
VoLTE: Benefits and Disadvantages. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X