ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో స్కైపీ ఫ్రీ వీడియో ఛాటింగ్

Posted By: Super

ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో స్కైపీ ఫ్రీ వీడియో ఛాటింగ్

న్యూయార్క్: ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీస్ స్కైపీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ కోసం ఓ సరిక్రొత్త అప్లికేషన్‌ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇంతకీ ఏమిటా ఆ కొత్త ఆఫ్లికేషన్ అని అనుకుంటున్నారా.. ఆండ్రాయిడ్ 2.0తో రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్స్ లకు స్కైపీ వీడియో కాలింగ్ సర్వీస్‌ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లిడించింది. ఈ అప్లికేషన్ వల్ల యూజర్స్ ఎవరైతే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్‌ని వాడుతారో అలాంటి వారు వారియొక్క స్కైపీ కాంటాక్ట్స్‌ని వేరే ఐపోన్, మ్యాక్, విండోస్ పిసి లాంటి మొబైల్స్ కలిగిన స్కైపీ కస్టమర్స్‌తో కూడా వీడియో చాటింగ్ చేయవచ్చునని తెలిపారు.

కొత్తగా విడుదల చేసినటువంటి ఈ ఆండ్రాయిడ్ వీడియో చాటింగ్ వై-పై, 3జి డేటా కనెక్షన్ ఉన్నవాటికి పని చేస్తుందని తెలిపారు. ఈ సందర్బంలో స్కైపీ వైస్ ప్రెసిడెంట్(జనరల్ మేనేజర్ ప్రోడక్ట్ అండ్ మార్కెటింగ్) మాట్లాడుతూ స్కైపీ వీడియో కాలింగ్‌ని రాబోయే కాలంలో మరిన్ని ఫ్లాట్ ఫామ్స్‌కి విడుదల చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతానికి స్కైపీకి 30మిలియన్ల యూజర్లు ఉన్నారని అన్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు అనుకూలంగా స్కైపీ వీడియో కాలింగ్‌ని విడుదల చేయడానికి కారణం యూజర్స్ వారియొక్క ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు వారికి నచ్చిన వారితో షేర్ చేసుకుంటారనే ఉద్దేశ్యం అని అన్నారు.

యూజర్స్ కొత్త స్కైపీని డౌన్ లోడ్ చేసుకోవాలంటే గనుక ఆండ్రాయిడ్ మార్కెట్‌కి లేదా స్కైపీ వెబ్‌సైట్ లోకి చేసుకోవడం మంచిది. ఇక సాప్ట్ వేర్ గెయింట్ మైక్రోసాప్ట్ ఇటీవలే స్కైపీని స్వాధీన పరచుకున్న విషయం తెలిసిందే. వీటితో పాటు మార్కెట్లో స్కైపీ వీడియో కాలింగ్ ఫెసిలిటీ అందుబాటులో ఉన్న మొబైల్స్ హెచ్‌టిసి డిజైర్ ఎస్, సోని ఎరిక్సన్ ఎక్స్ పీరియా నియో, సోని ఎరిక్సన్ ఎక్స్ పీరియా ప్రో మరియు గూగుల్ నెక్సస్ ఎస్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot