జియో ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఎక్కడ ఆర్డర్ చేయాలి?

ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 40వ వార్షిక సర్వసభ్య సమవేశంలో భాగంగా మీటింగ్‌లో భాగంగా ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ జియోఫోన్(JioPhone)ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఈ స్మార్ట్ ఫీచర్ 4జీ వోల్ట్ ఫోన్ ఆగష్టు 15 నుంచి ఎంపిక చేసిక కస్టమర్ లకు ట్రెయిల్ బేసిస్ క్రింద అందుబాటులో ఉంటుంది. ప్రీబుకింగ్స్ ఆగష్టు 24 నుంచి, డెలివరీ ప్రాసెస్ సెప్టంబర్ మొదటి వారం నుంచి ప్రారభమవుతుంది.

జియో ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఎక్కడ ఆర్డర్ చేయాలి?

ఇక ధర విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ ప్రతిఒక్కరికి ఉచితంగా లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్ క్రింద ముందుగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని మూడు సంవత్సరాల తరువాత తిరిగి రీఫండ్ చేసేస్తారు. జియోఫోన్‌‌ను ప్రీ-బుక్ చేసుకోవాలనుకునే వారు MyJio app లేదా జియో రిటైలర్ ను సంప్రదించటం ద్వారా ఆగష్టు 24 నుంచి ఈ ఫోన్‌ను బుక్ చేసుకునే వీలుంటుంది. సెప్టంబర్ నుంచి ప్రారంభమయ్యే డెలివరీ ప్రాసెస్‌లో భాగంగా వారానాకి 50 లక్షలు జియోఫోన్ యూనిట్లను డెలివరీ చేస్తామని అంబానీ తెలిపారు.

జియో ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఎక్కడ ఆర్డర్ చేయాలి?

జియోఫోన్ స్పెసిఫికేషన్స్.. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

English summary
Want to Buy Jio Phone? Here's How You Can Book One . Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot