ఆ తేదీ సెట్ చేస్తే ఐఫోన్ సర్వనాశనమే !

Written By:

1970 జనవరి 1వ తేదీ..మీ ఐ ఫోన్ సర్వనాశనం అయ్యేందుకు మీకు స్వాగతం చెప్పే రోజు..అదేంది.. అని షాక్ కాకండి. ఆ తేదీని మీరు మీ ఐఫోన్‌లో సెట్ చేశారనుకోండి. మీ ఐఫోన్ ఇక పనిచేయదు. మీరు ఎంత మొత్తుకున్నా గింజుకున్నా మీ ఫోన్ పనిచేయదు. చివరకు ఆపిల్ కంపెనీకి కూడా మీ ఫోన్ సర్వీసింగ్ చేయడానికి సాధ్యం కాదు...మరి ఎందుకు అలా అవుతుందో మీరే చూడండి.

Read more : స్మార్ట్‌ఫోన్‌తో స్మార్ట్‌గా జీవితం నాశనం: కారణాలు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జనవరి 1 తేదీ 1970తో మీ ఆపిల్ ఐ ఫోన్ తేదీని

జనవరి 1 తేదీ 1970తో మీ ఆపిల్ ఐ ఫోన్ తేదీని మార్చి రీబూట్ చేశారా....మీ కొంప కొల్లేరే.... మీ ఐ ఫోన్ బ్రిక్ అవుతుంది. అలా ఒకసారి బ్రిక్ అయిన ఫోన్‌ను రీస్టోర్ లేదా రీపేర్ చేయడానికి అవకాశాలు కూడా లేవు.

అది కొన్ని ఐ ఫోన్లకు మాత్రమే దెబ్బ

అలా అని కంగారుపడాల్సిన పనిలేదు.అది కొన్ని ఐ ఫోన్లకు మాత్రమే దెబ్బ. 64 బిట్ వెర్షన్ కలిగిన ఐఓఎస్8, ఐఓఎస్ 9 ఐ ఫోన్ 5ఎస్ తదుపరి మోడళ్లు , ఐపాడ్ ఎయిర్ ,ఐపాడ్ మిని 2, 2015లో విడుదలైన 6వ తరం ఐపాడ్ టచ్ మోడళ్లలో మాత్రమే ఈ బగ్‌ను కనుగొన్నారు.

అయితే ఆపిల్ కంపెనీ కూడా సమస్యకు

అయితే ఆపిల్ కంపెనీ కూడా సమస్యకు ఖచ్చితనమైన కారణం ఇంతవరకు కనుగొనలేదు. జనవరి 1 1970 తేదీ సెట్టింగ్ లో జీరో లేదా అంతకంటే తక్కువ విలువ కలిగి ఉండటం ద్వారా టైమ్ స్టాపింగ్ లో లోపంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మీరు పబ్లిక్ వైఫైలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

మీరు పబ్లిక్ వైఫైలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ వైఫ్ ఉపయోగించే ఐ ఫోన్ వినియోగదారుల్లో పైన పేర్కొన్న మోడళ్లను ఉపయోగిస్తున్న సమయంలో హ్యాకర్ వారి ఫోన్లలోకి ప్రవేశించి తేదీని మార్చడం ద్వారా ఫోన్ బ్రిక్ చేసే అవకాశం ఉంది. బగ్ ను పరిష్కరించే వరకు పబ్లిక్ వైఫైకి దూరంగా ఉండటం మంచిది.

జైల్‌బ్రేక్ చేయబడిన ఐ ఫోన్‌లలో

జైల్‌బ్రేక్ చేయబడిన ఐ ఫోన్‌లలో ఈ తేదీని సెట్ చేసి రీ స్టార్ట్ చేసినప్పటికీ ఎటువంటి సమస్య లేకుండా ఆన్ అయ్యాయి. బగ్ అయిన ఫోన్లలోని సమస్యను ఆపిల్ కంపెనీ పరీక్షిస్తున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు.

వారంటీ వ్యవధి కలిగి ఉన్న ఐ ఫోన్ వినియోగదారులు

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వారంటీ వ్యవధి కలిగి ఉన్న ఐ ఫోన్ వినియోగదారులు తేదీ మార్పు ప్రయోగాన్ని చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే మీ చేతులారా ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే మరి.

ఆపిల్ నుంచి రానున్న అన్నీ ఐఫోన్‌లకు

ఆపిల్ నుంచి రానున్న అన్నీ ఐఫోన్‌లకు ఈ బగ్‌కు సంబంధించి సమస్యను ఎదుర్కునే సాఫ్ట్‌వేర్‌‌ను విధంగా అప్‌డేట్ ఇస్తున్నామని ఆపిల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

మీరు ఇలా బగ్ భారీన పడితే ఆపిల్ సపోర్ట్ తీసుకోమని

అయితే మీరు ఇలా బగ్ భారీన పడితే ఆపిల్ సపోర్ట్ తీసుకోమని ఆపిల్ యాజమాన్యం చెబుతోంది. మీరు సొంత ప్రయోగాలు చేయకుండా నేరుగా ఆపిల్ స్టోర్ కెళ్లి మీ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా వారు సూచిస్తున్నారు.

తేదిని సెట్ చేస్తే ఎలా ఆగిపోతుందో తెలిపే వీడియో ఇదే

తేదిని సెట్ చేస్తే ఎలా ఆగిపోతుందో తెలిపే వీడియో ఇదే

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Want to destroy an iPhone Set the date to January 1, 1970
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot