బ్లాక్‌బెర్రీ జెడ్3.. లోపలికి వెళితే!!!

Posted By:

కెనడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపనీ బ్లాక్‌బెర్రీ ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించింది. కానీ, ఇప్పుడు ఆ కంపెనీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరస వైఫల్యాల కారణంగా కన్స్యూమర్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ తన వాటాను కోల్పోతూ వస్తోంది. ఈ నేపధ్యంలో మరో ముందడుగులో భాగంగా బ్లాక్‌బెర్రీ జెడ్3 పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడదుల చేసింది. ధర రూ.15,990. ఈ ఫోన్ బ్లాక్‌బెర్రీ కొత్త వర్షన్ 10.2 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. బ్లాక్‌బెర్రీ జెడ్3 స్మార్ట్‌ఫోన్‌లను ఫాక్స్‌కాన్ కంపెనీ తయారు చేసింది. ఈ ఫోన్ డిజైన్ ఆకట్టుకునే రీతిలో ఉంటుంది.

బ్లాక్‌బెర్రీ జెడ్3.. లోపలికి వెళితే!!!

బ్లాక్‌బెర్రీ జెడ్3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 960 × 540పిక్సల్స్),బ్లాక్‌బెర్రీ 10.2.1 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ (ఎమ్ఎస్ఎమ్823‌0) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జ5జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0 ఎల్ఈ), 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ మందం 9.26 మిల్లీమీటర్లు, బరువు 164 గ్రాములు.

బ్లాక్‌బెర్రీ జెడ్3 పనితీరుకు సంబంధించి మా ప్రతినిధి అందిస్తోన్న వీశ్లేషణాత్మక వీడియో రివ్యూ..

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/iUBXkHQ23GI? feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
l

English summary
Watch BlackBerry Z3 Unboxing [VIDEO]. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot