ఈ ఉపయోగాలు తెలిస్తే పాత ఫోన్లను మూలన పడేయరు !

|

స్మార్ట్‌ఫోన్ వినియోగం విషయంలో నేటి యువత సరికొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. వారు వాడుతున్నది లేటెస్ట్ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోనే అయినా మార్కెట్లోకి మరో కొత్త మోడల్ వచ్చిందంటే చాలు, పాత మొబైల్‌ను ఎంతో కొంతకు వదిలించేసుకుని కొత్త ఫోన్ కోసం పరుగులు పెట్టేస్తున్నారు. మరికొంతమందైతే ఈ ఫోన్లను ఏ చెత్త కుండీలోనో పడేస్తుంటారు. అయితే, మీరు వాడినంత కాలం వాడి ఆ తర్వాత వదిలేసిన ఫోన్‌తో అదనపు ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌లను అనేక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. మరి పాత ఫోన్లు ఏ అవసరాలకు ఉపయోగించుకోవచ్చనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

సైలెంట్‌గా దూసుకొస్తున్న Redmi S2, సర్‌ప్రైజ్ అంటున్న షియోమిసైలెంట్‌గా దూసుకొస్తున్న Redmi S2, సర్‌ప్రైజ్ అంటున్న షియోమి

వైర్‌లెస్ ట్రాక్‌ప్యాడ్‌

వైర్‌లెస్ ట్రాక్‌ప్యాడ్‌

జీమోట్ 2.0 అనే యాప్ సాయంతో మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌ను కంప్యూటర్‌కు వైర్‌లెస్ ట్రాక్‌ప్యాడ్‌లా ఉపయోగించుకోవచ్చు.

జీపీఎస్ నేవిగేటర్‌

జీపీఎస్ నేవిగేటర్‌

మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌ను కారుకు కనెక్ట్ చేసుకుని జీపీఎస్ నేవిగేటర్‌లా ఉపయోగించుకోవచ్చు

సెక్యూరిటీ వెబ్ క్యామ్‌

సెక్యూరిటీ వెబ్ క్యామ్‌

స్మార్ట్‌ఫోన్‌లను వైర్‌లెస్ సెక్యూరిటీ కెమెరాలుగా మార్చే అనేక యాప్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఓ సెక్యూరిటీ వెబ్ క్యామ్‌లా ఉపయోగించుకోవచ్చు.

ఈబుక్ రీడర్‌
 

ఈబుక్ రీడర్‌

మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే బుక్స్, అమెజాన్ కైందిట్, పాకెట్ వంటి రీడింగ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని ఈబుక్ రీడర్‌లా ఉపయోగించుకోవచ్చు.

వీడియో చాట్ టెర్మినల్‌

వీడియో చాట్ టెర్మినల్‌

మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ హ్యాంగ్‌అవుట్స్, స్కైప్ వంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని వీడియో చాట్ టెర్మినల్‌లా ఉపయోగించుకోవచ్చు.

డేటా స్టోరేజ్ డివైస్‌

డేటా స్టోరేజ్ డివైస్‌

మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌ను డేటా బ్యాకప్ లేదా డేటా స్టోరేజ్ డివైస్‌లా వాడుకోవచ్చు.

గేమింగ్ డివైస్‌

గేమింగ్ డివైస్‌

మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో వివిధ రకాల గేమ్‌లను లోడ్ చేసి గేమింగ్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు.

టెస్ట్ డివైస్‌

టెస్ట్ డివైస్‌

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను వివిధ అప్లికేషన్‌లను పరీక్షించుకునే టెస్ట్ డివైస్‌లా ఉపయోగించుకోవచ్చు.

మీడియా ప్లేయర్‌

మీడియా ప్లేయర్‌

మీ పాత స్మార్ట్‌ఫోన్ టీవీ‌ అవుట్ స్లాట్‌ను కలిగి ఉన్నట్లయితే టీవీకి కనెక్ట్ చేసుకుని మీడియా ప్లేయర్‌లా ఉపయోగించుకోవచ్చు.

వై-ఫై రూటర్‌

వై-ఫై రూటర్‌

మీ పాత స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై హాట్‌స్పాట్ ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేసి వై-ఫై రూటర్‌లా వాడుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Cool Uses of Your Old Android Smartphone You Probably Didn't Know More news At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X