వన్‌ప్లస్ 6 కెమెరా ఎలా ఉండబోతోంది,అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ

వన్‌ప్లస్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న వన్‌ప్లస్ 6 లాంచ్ సమయం దగ్గరపడే కొద్ది రోజురోజుకు అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది.

|

వన్‌ప్లస్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న వన్‌ప్లస్ 6 లాంచ్ సమయం దగ్గరపడే కొద్ది రోజురోజుకు అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం దాని కెమెరా పనితీరు కావడమే. అధ్భుతమైన కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకురానున్న నేపథ్యంలో అభిమానులు లాంచింగ్ సమయంలో ఫోన్ చేతికందుకుని దాంతో ఫోటోలు దిగాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా కంపెనీ తన అఫిషియల్ వైబ్‌సైట్ Oneplus.inలో Blind Test పేరిట కెమెరా క్వాలిటీలను కాంపేర్ చేసే పోటీని ప్రవేశపెట్టింది. టాప్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు Google Pixel 2 XL, iPhone X, Samsung Galaxy S9లాంటి కెమెరాలతో పోల్చి చూశారు. నాలుగు కేటగిరిలుగా డివైడ్ చేసిన ఇందులో Architecture, Low-light, Low-light Portrait, and Portraitలను పోల్చి చూశారు. వీటిల్లో బెస్ట్ ఇమేజ్ ఏదో సెలక్ట్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా వన్‌ప్లస్ 6ను గిప్ట్ గా అందించబడుతుంది.

మే 17న మార్కెట్లోకి OnePlus 6, ఫీచర్లు, ధర మరిన్ని వివరాలు మీకోసం !మే 17న మార్కెట్లోకి OnePlus 6, ఫీచర్లు, ధర మరిన్ని వివరాలు మీకోసం !

అన్నికేటగిరీల్లో అన్ని రకాల షాట్లను..

అన్నికేటగిరీల్లో అన్ని రకాల షాట్లను..

ఈ పోటీలో వన్‌ప్లస్ 6 నుంచి అన్నికేటగిరీల్లో అన్ని రకాల షాట్లను తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలను ఫోటోలో చూడవచ్చు. తక్కువ ధరలో లాంచ్ కానున్న ఈ ఫోన్ శాంపిల్ షాట్స్ మీరు Blind Test ద్వారా చూడవచ్చు. ఇతర ఫోన్లకు ధీటుగా దీని కెమెరా ఉండబోతుందనేది మాత్రం నిజమనే విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు.

కెమెరా గురించి

కెమెరా గురించి

కెమెరా గురించి ఇది వరకు పోస్టుల్లోనే చర్చించుకున్న సంగతి తెలిసిందే. కెమెరా విషయానికొస్తే vertical dual camer సెటప్ తో వస్తోంది. దీని ద్వారా మీరు అత్యంత తక్కువ వెలుతురులో కూడా నాణ్యమైన ఫోటోలను తీసుకునే అవకాశం ఉంది. Red colored alert slider అనే కొత్త ఫీచర్ ద్వారా మీరు మీ నోటిఫికేషన్లను వేగంగా తెలుసుకునే అవకాశం ఈ ఫోన్లో ఉంది. ఆడియో ఫైల్స్ కూడా చాలా త్వరగా ఓపెన్ అవుతాయి.దీంతో పాటు అలర్ట్ స్లైడర్ ద్వారా కెమెరా ఫోకస్ ను ఆటోమేటిగ్గా సెట్ చేసుకునే వీలుంది. అలర్ట్ స్లైడర్ ద్వారా అటు ఆడియో ప్రొఫైల్స్ అయిన రింగ్, అలాగే డూ నాట్ డిస్ట్రబ్, సైలెంట్ మోడ్స్ ను స్విచ్ చేసుకునేందుకు ఈ గెశ్చర్ ఉపయోగపడుతుంది.ఫ్యాషన్, ఫోర్టెయిట్ ఫోటోగ్రాఫర్ ErrikosAndreou వన్‌ప్లస్ 6 కెమెరాతో బాలీవుడ్ హీరోయిన్ ఆదితి రావు హైదరిని తీసిన ఫోటో ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

 ఫీచర్ల విషయానికొస్తే..

ఫీచర్ల విషయానికొస్తే..

5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1800 x 3200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, వెనుక భాగంలో 23 మెగాపిక్సల్ కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌లో లభ్యం కానున్నాయి.

ఇంకా కొన్ని రకాల ఆఫర్లను ..

ఇంకా కొన్ని రకాల ఆఫర్లను ..

ఈ కాంటెస్టులో మీరు ఇంకా కొన్ని రకాల ఆఫర్లను అందుకోవచ్చు.నాలుగు కేటగిరీల్లో పెడుతున్న ఈ పోటీలో మీరు రూ.300 వోచర్,అలాగే టోపీ, ఇతర రకాల వాటిని గెలుచుకునే అవకాశం ఉంది.ఈ ఫోన్ ఈ నెల 17న ముంబైలో జరిగి వేడుకలో లాంచ్ కానుంది. లైవ్ స్ట్రీమ్ ద్వారా ఈ లాంచ్ ఈవెంట్ ని చూడాలనుకునే వారు https://www.oneplus.in/launch-6 క్లిక్ చేసి చూడవచ్చు.

Best Mobiles in India

English summary
Participate in OnePlus 6 ‘Blind test’ and get a chance to win the upcoming flagship smartphone and exciting OnePlus 6 goodies in the lucky draw More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X