వుయ్‌చాట్ రక్షాబంధన్ ఆఫర్: రూ.60 వరకు ఉచిత రీచార్జ్

Posted By:

పవిత్ర ప్రేమకు నిర్వచనంగా పిలవబడే ‘రక్షా బంధన్' పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వుయ్‌‍చాట్ ‘‘ఫ్రెండ్స్ ఎన్ రివార్డ్స్'' ( "Friends n Rewards") పేరుతో సరికొత్త ఆఫర్‌ను అందుబాటులో తీసుకువచ్చంది. ఈ ఆఫర్‌లో భాగంగా ‘రక్షా బంధన్' సందర్భాన్ని పురస్కరించుకుని వుయ్‌చాట్ యూజర్లు సదరు యాప్ ద్వారా మిత్రులు అలానే బంధువులకు సందేశాత్మక భావాలతో కూడిన వుయ్‌చాట్ ప్రత్యేకమైన స్టిక్కర్లను పంపటం ద్వారా రూ.60 వరకు ఉచిత రిచార్జ్‌ను పొందవచ్చు. ఆగష్టు 4ను ప్రారంభమైన ఈ ఆఫర్ ఆగష్టు 13వ తేదీతో ముగుస్తుంది.

వుయ్‌చాట్ రక్షాబంధన్ ఆఫర్: రూ.60 వరకు ఉచిత రీచార్జ్

ఈ ఆఫర్‌కు సంబంధించిన మరింత సమచారాన్ని వుయ్‌చాట్ బృందం అధికారిక అకౌంట్‌లోకి లాగిన్ అవటం ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ల విభాగంలో వాట్స్‌యాప్ వంటి ప్రముఖ సర్వీసులకు వుయ్‌చాట్ పోటీనిస్తోంది. వుయ్‌చాట్ ఇన్స్‌స్టెంట్ మెసెంజర్ అప్లికేషన్‌ను 2011 జనవరిలో ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా యూజర్లు మొబైల్ టెక్స్ట్ అలానే వాయిస్ మెసేజింగ్ కమ్యూనికేషన్ సేవలను ఉచితంగాపొందవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్, ఐఫోన్, బ్లాక్‌బెర్రీ, విండోస్ ఇంకా సింబియాన్ ఫోన్‌లను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. 2013 గణాంకాల ప్రకారం వుయ్‌చాట్ 300 మిలియన్ యూజర్లను కలిగి ఉంది. గత నెలలోనే వుయ్‌చాట్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మెసేజ్ రీకాల్ సపోర్ట్‌ను అప్‌డేట్ చేసింది. అలానే 1జీబి ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా అందిస్తోంది. వుయ్‌చాట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నిలయ అరోరా ప్రత్యేక ఇంటర్వ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/vbAl_N0Jo4g? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting