ఆరోగ్యాన్ని పర్యవేక్షించే వెల్లో ఫోన్ కేస్

Posted By:

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల తయారీ కంపనీ Azoi మనిషి ఆర్యోగాన్ని పర్యవేక్షించగలిగే సరికొత్త మొబైల్ ఫోన్ కేస్‌ను ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం రూపొందించింది. ‘వెల్లో' (wello) పేరుతో రూపకల్పన చేయబడిన ఈ ఫోన్ కేస్ ధర రూ.12,350. ప్రస్తుతం ఈ ఫోన్ కేస్‌కు సంబంధించిన ప్రీఆర్డర్లను Azoi అధికారిక వెబ్‌సైట్ స్వీకరిస్తోంది. బుక్ చేసుకున్న వారికి మార్చి లేదా ఏప్రిల్‌లో పంపిణీ ఉంటుంది.

ఆరోగ్యాన్ని పర్యవేక్షించే వెల్లో ఫోన్ కేస్

ఐఫోన్ కేస్ తరహాలో రూపకల్పన చేయబడిన వెల్ ఫోన్ కేస్ వివిధ సెన్సార్లను కలిగి ఉంటుంది. వెల్లో ఫోన్ కేస్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసిన తరువాత కేస్ వెనుక భాగంలో నిర్మితమైన సెన్సార్ల పై యూజర్ కొత్త సెకన్లపాటు తన వేలిని ఉంచినట్లయితే యూజర్ యొక్క గుండె రేటు, ఉష్ణోగ్రత, రక్తపోటు, ఎలెక్ట్రో (ECG), రక్త ఆక్సీజనీకరణ, ఊపిరితిత్తుల పనితీరు వంటి ఆరోగ్యసంబంధిత అంశాలు మానిటర్ చేయబడతాయి.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/3c6QdNhy1Aw?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot