మార్కెట్లోకి పుల్లీ లోడెడ్ మొబైల్ ఫోన్స్

Posted By: Super

మార్కెట్లోకి పుల్లీ లోడెడ్ మొబైల్ ఫోన్స్

మొబైల్ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న వెస్టన్ మొబైల్ కంపెనీ తన అమ్ముల పోద నుండి ఏకకాలంలో మూడు మొబైల్స్‌ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. వెస్టన్ మొబైల్స్ విడుదల చేయనున్న ఆ మూడు మొబైల్స్ పేర్లు డబ్ల్యుబి 808, డబ్ల్యుబి 606, డబ్ల్యుబి 404. మూడు మొబైల్స్‌ని కూడా చక్కని ఫీచర్స్‌తో రూపోందించడం జరిగింది. వెస్టన్ ఫోన్స్ చూడచక్కని ఫీచర్స్‌తో స్టైలిష్ తరహాలో రూపోందించడం జరిగింది. ఇటీవలే విడుదల చేసిన డబ్ల్యుబి 404 మొబైల్ పుల్లీ లోడెడ్ మొబైల్ ఫోన్.

డబ్ల్యుబి 404 మొబైల్ ఫోన్ 1.3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి హై క్వాలిటీ ఫిక్చర్స్‌ని తీసేందుకు ఉపయోగపడుతుంది. వీటితో పాటు, మ్యూజిక్ ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ ఎమ్ రేడియో, వాయిస్ రికార్డర్ లాంటి వాటిని కూడా అనుసంధానం చేయడం జరిగింది. రాత్రి వేళ్లల్లో ఎక్కడికైనా వెల్లేందుకు వీలుగా ఇందులో టార్చి లైట్ కూడా అమర్చడం జరిగింది. ఇక కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, జిపిఆర్‌ఎస్ లను కూడా సపోర్ట్ చేస్తుంది. 2 ఇంచ్ స్క్రీన్ సైజు డిస్ ప్లే కలిగిన ఈ మొబైల్ ఫోన్ 176 X 220 ఫిక్సల్ రిజల్యూషన్‌ని అందిస్తుంది.

ఇక డబ్ల్యుబి 808 ఫోన్ క్యాండీ బార్ మోడల్ ఫోన్. ఈ మొబైల్‌లో అత్యాధునిక ఫీచర్స్‌ని ఇమిడీకృతం చేయడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మిడిల్ రేంజి మొబైల్ పోన్స్‌లలో ఏయే ఫీచర్స్ ఐతే ఉన్నయో అటువంటి అన్ని రకాల ఫీచర్స్ ఇందులో కూడా ఉన్నాయి. డబ్ల్యుబి 808 మొబైల్‌లో చక్కని క్వాలిటీ కలిగిన మ్యూజిక్ ప్లేయర్ తోపాటు, మోషన్ సెన్సార్, మొబైల్ ట్రాకర్‌ని కలిగి ఉంది. 2.4 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉండి 240 X 320 ఫిక్సల్ రిజల్యూషన్‌తో యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుంది. వీటితో పాటు అధనంగా వరల్డ్ క్లాక్, క్యాలెండర్, ఎఫ్ ఎమ్ రేడియో లాంటి ఫీచర్స్ అదనం.

ఇక వెస్టన్ మొబైల్ విడుదల చేసిన మూడవ మొబైల్ డబ్ల్యుబి 606. ఇది కూడా డబ్ల్యుబి 808 మాదిరే క్యాండీ బార్ డిజైన్ మోడల్. డబ్ల్యుబి 606 మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 64 MBరాగా, మొబైల్ లో ఉన్న మైక్ర్ ఎస్‌డి కార్డ్ ద్వారా మొమొరీని 8GB వరకు విస్తరించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. డబ్ల్యుబి 606 మొబైల్‌ 1.3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. వీటితోపాటు అదనంగా కనెక్టివిటీ ఫచర్స్ అయిన బ్లూటూత్, జిపిఎస్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot