ఇక బెండబుల్ ఫోన్‌ల ఒరవడి!

ఎల్‌జీ, సామ్‌సంగ్ తరహాలోనే బెండబుల్ ఫోన్‌లను అభివృద్థి చేసేందుకు చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ షియోమీ తహతహ లాడుతోంది. బెండబుల్ సామర్థ్యంతో కూడిన ఓ ఫోన్‌ను తన సొంత వర్షన్‌తో షియోమీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక బెండబుల్ ఫోన్‌ల ఒరవడి!

Read More : 6జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ ఫోన్, రేపే మార్కెట్లోకి?

ఈ ఫోన్‌కు సంబంధించి 30 సెకన్ల వీడియో వారం క్రిందట ఇంటర్నెట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఫోల్డబుల్, బెండబుల్ స్మార్ట్‌ఫోన్‌లకు భవిష్యత్‌లో మరింత డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తోన్న నేపథ్యంలో మరో చైనా కంపెనీ లెనోవో రెండు ఫ్యూచరిస్టిక్ ఫోల్డబుల్ కాన్సెప్ట్స్‌తో ముందుకొచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్, యాపిల్ పోటాపోటీగా

సామ్‌సంగ్ గత కొన్ని సంవత్సరాలుగా ఫోల్డబుల్ డిస్‌ప్లే ఫోన్‌ల పై పనిచేస్తోన్న విషయం తెలిసిందే. 2017లో ఈ బ్రాండ్ నుంచి మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముంది. మరోవైపు యాపిల్ యాపిల్ కూడా కర్వుడ్ స్ర్కీన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అభివృద్థి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

WhammyPhone పేరుతో..

బెండబుల్ డిస్‌ప్లే ఫోన్‌లకు ఒక్కసారిగా క్రేజ్ నెలకున్న నేపథ్యంలో క్యూన్స్ యూనివర్శిటీ హ్యుమన్ మీడియా ల్యాబ్ WhammyPhone పేరుతో ఓ సరికొత్త క్రియేటివ్ బెండబుల్ స్మార్ట్ ఫోన్ లను వెలుగులోకి తీసుకువచ్చింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంగీత పరికరంలో కూడా ..

ఈ బెండబుల్ ఫోన్.. స్మార్ట్‌ఫోన్ కార్యశీలతను కొత్త కోణంలో ఆవిష్కరించగలదని తయారీదారులు చెబుతున్నారు. ఈ ఫ్లెక్సిబుల్ డివైస్‌ను సంగీత పరికరంలో కూడా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

 

డిస్‌ప్లేను రకరకాలుగా బెండ్ చేస్తూ..

WhammyPhone డిస్‌ప్లేను రకరకాలుగా బెండ్ చేస్తూ విభిన్నమైన సౌంగ్ ఎఫెక్ట్స్‌ను సృష్టించవచ్చట.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్గానిక్ ఎల్ఈడి (ఫోల్డ్) డిస్‌ప్లే..

ఫుల్ హైడెఫినిషన్ 1920 x 1080 పిక్సల్ ఫ్లెక్సిబుల్ ఆర్గానిక్ ఎల్ఈడి (ఫోల్డ్) డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారట. 

సౌండ్ సింథసైజర్ సాఫ్ట్‌వేర్‌..

ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన సౌండ్ సింథసైజర్ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా వివిధ రకాల సౌండ్‌లను ప్లే చేసేందుకు అవసరమైన బటన్‌లను యూజర్ చూడగలుగుతారు. ప్రత్యేకమైన బెండ్ సెన్సార్‌ను WhammyPhoneలో నిక్షిప్తం చేసారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
After Xiaomi's Bendable Phone, WhammyPhone Hits the Web [IN PICTURES]. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot