ఫోన్ కొన్నారా.. సెక్యూరిటీ మాటేమిటి?

Posted By: Super

ఫోన్ కొన్నారా.. సెక్యూరిటీ మాటేమిటి?

గూగుల్‌ గూటి నుంచి వచ్చిన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ గుండె చప్పుడులా మారిపోయింది. పేరొందిన మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టంలను వెనక్కి నెట్టేసి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న మొబైల్‌ ఫ్లాట్‌ఫాంగా రికార్డ్‌లు సృషిస్తోంది. కమ్యూనిటీ డెవలపర్స్‌తో ‘ఆండ్రాయిడ్‌ మార్కెట్‌ స్టోర్‌’లో సుమారు 2,00,000 అప్లికేషన్స్‌ని అందుబాటులో ఉంచారు. దీంతో మినీ ల్యాప్‌టాప్‌గా మారిన మొబైల్‌పై హ్యాకర్లు వైరస్‌లతో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌కి అంగరక్షకుల్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం.

మొబైల్‌ను స్కాన్‌ చేసి వైరస్‌ జాడల్ని వెతికి పట్టేయాలంటే యాంటీ వైరస్‌ను మీ హ్యాండ్ సెట్‌లో నిక్షిప్తం చేసుకోవాల్సిందే. ఈ అప్లికేషన్‌లోని షెడ్యూల్‌ స్కానింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవటం ద్వారా నిర్ణీత సమయానికి ఆటోమాటిక్‌గా మీ ఫోన్ స్కాన్ అయిపోతుంది. సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్‌ సమయంలో ఏవిధమైన వైరస్ లోనికి ప్రవేశించకుండా చూస్తుంది. వెబ్‌సైట్‌లు, ఈమెయిళ్లు, ఎసెమ్మెస్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసే డేటాని కూడా స్కాన్‌ చేస్తుంది.

మొబైల్‌ను పొగొట్టుకుంటే జీపీఎస్‌ సదుపాయంతో ఎక్కడుందో కనిపెట్టవచ్చు. మొబైల్‌కు తాళం వేసి డేటా మొత్తాన్ని చెరిపేసే వీలుంది. మొబైల్‌ను రక్షించే రక్షక భటుడిని పెట్టుకోవాలంటే LookOutను ఇన్‌స్టాల్‌ చేసుకోండి. సెక్యూరిటీ, బ్యాక్‌అప్‌ సౌకర్యాలతో రూపొందించారు. డేటాని హ్యాకర్ల చేతిలో పడుకుండా చూస్తుంది. Privacy Advisor ద్వారా లాగిన్‌ వివరాల్ని మానిటర్‌ చేస్తుంది. పొగొట్టుకున్న సందర్భాల్లో ఫోన్‌ పని చేయకుండా చేయడంతో పాటు, సమాచారాన్ని డిలీట్‌ చేయవచ్చు. ఫోన్‌నెంబర్లు, ఇతర సమాచారాన్ని బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. డిలీట్‌ చేసిన డేటాని తిరిగి పొందే వీలుంది. సైలెంట్‌ మోడ్‌లో పెట్టినప్పటికీ అలారం ద్వారా ఎక్కడుందో కనిపెట్టవచ్చు.

ప్రముఖ సెక్యూరిటీ సంస్ధ Norton ఉచితంగా అందిస్తున్న బీటా వర్షన్ నార్టాన్ స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీ మొబైల్‌ను పొగట్టుకున్న సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఎవరైనా సిమ్‌కార్డ్‌ని మార్చడానికి ప్రయత్నిస్తే మొబైల్‌ ‘లాక్‌’ అవుతుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని నిక్షిప్తం చేసుకుంటుంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌, టెక్ట్స్‌ మెసేజ్‌లను బ్లాక్‌ చేసే వీలుంది.

వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు చూడకుండా చేయాలంటే ఆండ్రాయిడ్ ప్రొటెక్టర్ ఉండాల్సిందే. ప్రత్యేక పిన్‌కోడ్‌ ద్వారా ముఖ్యమైనా సర్వీసుల్లోని డేటా (ఎసెమ్మెస్‌లు, జీమెయిల్‌, ఫోన్‌నెంబర్లు…) ఇతరుల కంటపడకుండా చేయవచ్చు. ఎన్నో వెబ్‌ సర్వీసుల్లో లాగిన్‌ అవుతుంటాం. వాటి యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం కష్టమే. మొబైల్‌ బ్రౌజింగ్‌లో లాగిన్‌ వివరాల్ని సురక్షితంగా మేనేజ్‌ చేసుకోవడానికి KeePassdroid ఉంది. అన్ని లాగిన్‌ వివరాల్ని డేటాబేస్‌ రూపంలో నిక్షిప్తం చేసి, మొత్తం డేటాబేస్‌కి ‘మాస్టర్‌ కీ’ని ఏర్పాటు చేసుకోవచ్చు. మాస్టర్‌ పాస్‌వర్డ్‌ని గుర్తుంచుకుంటే అన్నింటినీ గుర్తుంచుకున్నట్టే.

మొబైల్‌ని పాస్‌వర్డ్‌తో లాక్‌ చేయడం మర్చిపోవద్దు. ఇతరులు వాడకుండా Android Settings-> Location

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot