మీ మొబైల్ సెక్యూరిటీ కట్టుదిట్టమేనా..?

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. మెదడకు సాన పెట్టడం మనేసాం. మొబైల్ నెంబర్లను మొదలుకుని ఇతర వ్యక్తిగత వివరాల వరకు అన్ని అంశాలను స్మార్ట్‌ఫోన్‌లలో స్టోర్ చేసుకుంటున్నాం. మొబైల్ ఇంటర్నెట్‌ను విచ్చలవిడిగా వాడేస్తున్నాం. అయితే మనం చేస్తుంది సురక్షితమేనా..? మన మొబైల్ ఫోన్‌లలో డేటా సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి..?, మన స్మార్ట్‌ఫోన్ సైబర నేరాల భారిన పడకుండా ఉండాలంటే ఏమిటి మార్గం..?

మీ మొబైల్ సెక్యూరిటీ కట్టుదిట్టమేనా..?

ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, అంటే బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆన్‌లైన్ బ్యాకింగ్ లావాదేవీల వివరాలు, క్రెడిట్ కార్డ్ వివరాలు ఇంకా ఇతర ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఫోన్‌లో స్టోర్‌చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి. అలానే, మీ ఆన్‌లైన్ అకౌంట్‌లను ప్రతిసారీ సైన్ అవుట్ చేయటం మరవద్దు. మీ మొబైల్ డివైజ్ నుంచి ప్రతి 3 నెలలకు బ్యాకప్ తీసుకోండి.

మీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇన్స్యూరెన్స్ ను ప్రతి సంవత్సరం రిన్యువల్ చేసుకోవడం మరవద్దు. తరచూ స్కానింగ్ చేయండి. ట్రాకింగ్ సర్వీసులు, రికవరీ అప్లికేషన్ లను ఎనేబుల్ చేసి ఉంచినట్లయితే మి మొబైల్ డివైస్ మరింత సురక్షితంగా ఉన్నట్లే.

మీరు వాడే అకౌంట్లకు సంబంధించి తరచూ పాస్‌వర్డ్‌లను మార్చుకోండి. మార్చిన పాస్‌వర్డ్‌లను బండగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు వాడే ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు నిక్సిప్తం చేసుకోండి. బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టువిటీ ఆప్షన్‌లను అవసరమైన సమయంలో మాత్రమే ఆన్‌చేసి వాడుకోండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot