ఫోన్ ఆన్ అవటం లేదా..?
సమస్య ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నట్లయితే కొన్ని ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా ఫోన్‌ను తిరిగి ఆన్ చేయవచ్చు.
మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఆన్ అవటం లేదా..?, సాధారణంగా, హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ లోపాలు తలెత్తినపుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఆన్ అవకుండా మెరాయిస్తుంటుంది. సమస్య ఫోన్ హార్డ్‌వేర్‌లో ఉన్నట్లయితే మీకు మీరుగా పరిష్కరించుకోవటం కష్టతరమవుతుంది. సమస్య ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నట్లయితే కొన్ని ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా ఫోన్‌ను తిరిగి ఆన్ చేయవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

Empty battery కారణం అయితే..
బ్యాటరీ డెడ్ అయినట్లయితే మీ ఫోన్ టర్నాఫ్ అయినట్లయితే, "empty battery"తో ఉన్న మీ ఫోన్‌ను 10 నుంచి 15 నిమిషాల పాటు క్విక్ చార్జ్ చేయండి. ఆ తరువాత ఫోన్ ఆన్ చేసి చూడండి. సమస్య డెడ్ బ్యాటరీ కారణంగా ఏర్పడినట్లయితే వెంటనే సద్దుమణిగిపోతుంది.

రికవరీ మోడ్‌లో ఫ్యాక్టరీ రీసెట్
రికవరీ మోడ్‌లో ఫ్యాక్టరీ రీసెట్‌ను నిర్వహించటం ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్ సేఫ్ మోడ్‌లో రీబూట్ అవుతుంది. తద్వారా ఫోన్ ఆన్ అవ్వొచ్చు. ఫోన్ బటన్‌లను ఏకకాలంలో హోల్డ్ చేసి ఉంచటం ద్వారా ఫ్యాక్టరీ రీసెట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

సాఫ్ట్‌వేర్ పూర్తిగా దెబ్బతిన్నట్లయితే
మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ పూర్తిగా దెబ్బతిన్నట్లయితే ఫ్యాక్టరీ రీసెట్ ప్రక్రియ సజావుగా సాగదు. కాబట్టి, మీ ఫోన్ తయారీదారు ప్రొవైడ్ చేసిన ఆండ్రాయిడ్ ఫిర్మ్‌వేర్‌ను తిరిగి మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

ఎక్కువ యాప్స్ ఉండకూడదు..
పనికొస్తాయి కదా అని అనేక రకాల యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తుంటాం. ఈ యాప్‌లు డివైస్‌లో ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించేసి ఫోన్ వేగాన్ని పూర్తిగా తగ్గించి వేస్తాయి. ఫోన్ హ్యాంగ్ అవటానికి కూడా ఇది కారణం కావొచ్చ. కాబట్టి మీ ఫోన్‌ను ఎప్పటికప్పుడు సురక్షితంగానూ అదే సమయంలో క్లీన్‌గా ఉంచేందుకు ప్రయత్నం చేయండి.


Click it and Unblock the Notifications