ఐఫోన్ 16e ఫోన్‌లోని ‘e’ దేనికి సంకేతమో తెలుసా..
iPhone 16e: ఫిబ్రవరి 19న యాపిల్ కంపెనీ కొత్తగా ఐఫోన్ 16eని లాంచ్ చేసింది. కానీ ఈ పేరులో 'e’ దేనికి సూచనో మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు. ఐఫోన్ SE లో 'SE’ అంటే 'స్పెషల్ ఎడిషన్’ అని మనకు తెలుసు. కానీ ఇక్కడ అదే లాజిక్ వాడితే సెట్ అవ్వట్లేదు. ఒకవేళ 'e’ అంటే 'ఎడిషన్’ అనుకుంటే, అప్పుడు పేరు 'ఐఫోన్ 16 ఎడిషన్’ అవ్వాలి, కానీ అది కొంచెం వింతగా ఉంది.
యాపిల్ మాత్రం ఇప్పటిదాకా ఈ 'e’ వెనుక ఉన్న సీక్రెట్‌ని బయటపెట్టలేదు. కానీ ఇంతకుముందు యాపిల్ ప్రొడక్ట్‌ల పేర్లు చూస్తే మనకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. 2002లో యాపిల్ 'eMac’ని రిలీజ్ చేసింది. అప్పుడు 'e’ అంటే 'ఎడ్యుకేషన్’ అని అర్థం. స్కూళ్ల కోసం తక్కువ ధరలో కంప్యూటర్ అని దాన్ని తీసుకొచ్చారు.

కానీ అది పెద్దగా సక్సెస్ కాలేదు. ఇంకా 1982లో 'యాపిల్ IIe’ వచ్చింది. అప్పుడు 'e’ అంటే 'ఎన్‌హాన్స్‌డ్’ (మెరుగైన) అని అర్థం. అది యాపిల్ IIకి అప్‌గ్రేడ్ వెర్షన్, బాగా పాపులర్ అయింది. ఇంతవరకు యాపిల్ 'e’ ని ప్రొడక్ట్ పేరులో వాడింది ఈ రెండుసార్లే.
కానీ ఐఫోన్ 16e ఈ రెండు డెఫినిషన్స్‌లోనూ సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు. ఇది ఎడ్యుకేషన్ ఫోన్ కాదు, అలాగని ఇది ఉన్న ఫోన్‌కి మెరుగైన వెర్షన్‌లా కూడా లేదు. ఐఫోన్ 16e, ఇంతకుముందు వచ్చిన SE మోడల్స్‌లా అయితే లేదు. ఇందులో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 48MP వెనుక కెమెరాతో వచ్చింది.
* పవర్‌ఫుల్ చిప్
యాపిల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన A18 చిప్, ఫేస్ ఐడీ, వైర్‌లెస్ ఛార్జింగ్, యాక్షన్ బటన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి చూస్తుంటే ఇది ఐఫోన్ 16 సిరీస్‌కి దగ్గరగా అనిపిస్తుంది, SE మోడల్స్‌లా లేదు. కాకపోతే ఇందులో డైనమిక్ ఐలాండ్ బదులు నాచ్ డిస్‌ప్లే, మాగ్‌సేఫ్ సపోర్ట్ లేదు, కెమెరా కంట్రోల్ ఫీచర్ కూడా లేదు.
* మరి అర్థం ఏంటి..?
ఫీచర్లు, ధర రెండూ బ్యాలెన్స్‌డ్‌గా ఉండటం చూస్తే, కొంతమంది 'e’ అంటే 'ఎసెన్షియల్’ (అత్యవసరం) అని ఉండొచ్చు అంటున్నారు. అంటే ఇది ఐఫోన్ 16లో బడ్జెట్ ఫ్రెండ్లీ వెర్షన్, కానీ క్వాలిటీ మాత్రం బాగుంటుందని అర్థం. కొందరేమో 'ఎగ్జైటింగ్’ (ఉత్సాహపూరితమైన), లేదా 'ఎనిగ్మాటిక్’ (రహస్యమైన) అని కూడా అంటున్నారు.
ఎందుకంటే యాపిల్ దీని గురించి ఏం చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టింది. ఇంకా చెప్పాలంటే, ఈ ఐఫోన్‌లో యాపిల్ కొత్త C1 సెల్యులార్ మోడెమ్‌ని వాడింది. ఇది టెక్నాలజీ పరంగా చాలా పెద్ద అడుగు. దీన్ని బట్టి చూస్తే, యాపిల్ దీన్ని ఐఫోన్ 16s అని పెట్టి ఉంటే బాగుండేది. అప్పుడు కొత్త ఫీచర్లకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉండేది.
ఏదేమైనా, 'e’ అంటే ఏంటో మాత్రం ఇంకా మిస్టరీనే. సో, యూజర్లు వాళ్లకి తోచినట్టుగా దేనికైనా ఫిక్స్ అవ్వచ్చు. ధర తక్కువ కాబట్టి అఫోర్డబిలిటీకి, ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి కాబట్టి ఎసెన్షియల్‌కి, లేదా సింపుల్‌గా ఐఫోన్ 16 లైన్‌లో స్పెషల్ ఐడెంటిటీ కోసం కూడా 'e’ అని పెట్టి ఉండొచ్చు.


Click it and Unblock the Notifications








