Home
Mobile

3జీ మొబైల్ ఉంటే అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే

By Super
3G Mobiles
ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసిన 3జి మొబైల్ ఫోన్స్ గురించే ఆలోచన. అసలు 3జి అంటే ఏమిటో తెలుసుకుందాం. 3జీ అంటే సంక్షిప్తంగా ‘థర్డ్ జెనెరేషన్ మొబైల్ టెలిఫోనీ’. వేగంగా సమాచార మార్పిడి చేసుకొనేలా మొబైల్ నెట్‌వర్కులనీ , మొబైల్‌ఫోన్లలనీ రూపొందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవల్ని మొబైల్ లో వినియోగించుకునేలా రూపొందించిందే ఈ 3జీ. అరచేతిలో టీవీ! సినిమాలు, పాటలు, వార్తలు, ఓ మాదిరి సైజున్న వీడియో ఫైల్స్ ఏవైనా సరే చిటికలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

రానున్న కాలంలో మొబైల్ ఫోన్లోనే టివీలూ చూడగలుగుతారు. దానికి ఎక్కువ రిజల్యూషన్‌తో కూడిన డిస్ ప్లే సిస్టమ్, అధిక డాటాని వేగంగా రిసీవ్ చేసుకోగలగటం లాంటి ఎక్కువ సౌకర్యలను కలి గినమొబైల్ ఫోన్లు అవసరం. టీవీ ప్రోగ్రాములను ప్రసారం చేయడానికి ఛానల్స్ కూడా సిద్ధం అవుతున్నాయి. నచ్చిన ప్రోగ్రాంలను రికార్డ్ చేసుకొని ఫోన్ లో భద్రపరచుకోవచ్చు కూడా. వీడియో ఫైల్స్ ని, వాయిస్ కమ్యూనికేషన్ ను పూర్తిస్థాయిలో ౩జీ లో యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది.

వెబ్ కెమేరా ద్వారా కంప్యూటర్‌లో ఆన్‌లైన్ వీడియో ఛాటింగ్ ఎలా చేస్తున్నారో అదే విధంగా ఫోన్‌లో కూడా మీరు కనిపిస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. దీన్నే ‘వీడియో కాలింగ్’ అని పిలుస్తున్నారు. ఇలా కనిపిస్తూ మాట్లాడాలంటే ఇరువురి ఫోన్లలో కెమేరా కచ్చితంగా వుండాలి. మూడు నిమిషాలున్న ఎంపీ3 పాటను 2జీ తో డౌన్ లోడ్ చేస్తే సుమారు 31 నుండి 40 నిమిషాలు తీసుకుంటుంది. అదే వీడియో ను 3జీ తో 11 సెకన్ల నుంచి 1.5 సెకన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కార్లో వెళుతున్నప్పుడు కూడా 384 కేబీపీఎస్ వేగంతో డాటా ను డౌన్ లోడ్ చేసుకునేలా 3జీ పనిచేస్తుంది. 2జీ నెట్ వర్క్ 10kb/sec వేగంతో సమాచార మార్పిడి చేస్తే, 3జీ 2mb/sec స్పీడ్ తో చేస్తుంది. కంప్యూటర్‌లో పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ బ్రౌసింగ్ చేసుకోవచ్చు. వివిధ రకాల మల్టీమీడియా గ్రాఫిక్స్‌తో కూడిన ఎటాచ్‌మెంట్లతో ఈ-మెయిల్స్ ని చిటికెలో పంపేయొచ్చు.

వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్‌తోనూ, కొత్త వాళ్ళతోనూ ఆన్‌లైన‌ గేమ్స్‌లాగా, ఇక వీడియో గేమ్‌లూ అవలీలగా ఆడేయవచ్చు. మల్టీప్లేయర్ గేమ్‌లు కూడా మొబైల్ లో అందుబాటులోకి రానున్నాయి. తక్కువ సమయంలోనే గేమ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 3జి మొబైల్ గనుక ఉంటే ప్రపంచం మీ అరచేతిలోనే ఉన్నట్లే.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X