మీకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం గురించి తెలుసా..?

Posted By: Super

మీకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం గురించి తెలుసా..?

 

టెక్ ప్రేమికులకు సుపరిచితమైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం స్మార్ట్‌ఫోన్ అదేవిధంగా టాబ్లెట్ పీసీల ప్రపంచాన్ని శాసిస్తున్న విషయం తెలిసిందే. లైనెక్స్ (LINUX) ఆధారితంగా ఈ వోఎస్‌ను గుగూల్ వ్ళద్ధి చేసింది. అనేక వర్షన్‌లలో ఈ ఆపరేటింగ్ సిస్టం లభ్యమవుతోంది. జింజర్ బ్రెడ్, 3.0 హనీకూంబ్. 3.1 హనీకూంబ్, 3.2 హనీకూంబ్, 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వర్షన్‌లు వీటలో ప్రధానమైనవి.

మార్కెట్లోకి ఇటీవల కాలంలో ఎంట్రీ ఇచ్చిన ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం అనతికాలంలోనే విపరీతమైన ఆదరణను చొరగుంది. ఈ వోఎస్‌లో యూజర్ ఫ్రెండ్లీ లక్షణాలు హెచ్చుగా ఉండటంతో కంపెనీలన్ని అప్‌డేట్ చేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా రోజుకు 8,50,000 ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లు యాక్టివేట్ అవుతన్నట్లు గుగూల్ సంస్థ పేర్కొంది. దిగ్జజ శామ్‌సంగ్ సైతం ఆండ్రాయిడ్ వోఎస్‌ల పైనే ఆధారపడింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot