Bloatware అంటే ఏంటి, ఫోన్ నుంచి ఎలా తొలగించాలి..?

Bloatware అనేది ముందుగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పొందుపరచబడిన Pre-Installed యాప్స్ ద్వారా ఫోన్‌లలోకి ప్రవేశిస్తుంది. వీటిని తొలగిస్తే సమస్య తొలగిపోతుంది.

|

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఓపెన్ సోర్స్ కావటంతో అనేక సెక్యూరిటీ ప్రమాదాలు పొంచి ఉన్నాయని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా Bloatware నుంచి ఆండ్రాయిడ్ డివైస్‌లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఎక్కువుగా ఉందని వీరు చెబుతున్నారు. Bloatware అనేది ముందుగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పొందుపరచబడిన Pre-Installed యాప్స్ ద్వారా
ఫోన్‌లలోకి ప్రవేశిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పేరుకుపోయి ఉన్న Bloatware యాప్స్‌ను తొలగించేందుకు ముఖ్యమైన సూచనలు...

రక్షాబంధన్ స్పెషల్ ఆఫర్..స్మార్ట్‌ఫోన్ల పై 50శాతం డిస్కౌంట్రక్షాబంధన్ స్పెషల్ ఆఫర్..స్మార్ట్‌ఫోన్ల పై 50శాతం డిస్కౌంట్

స్టెప్ 1

స్టెప్ 1

ఫోన్‌లో ముందుగానే నిక్షిప్తమై ఉన్న కొన్ని స్టాక్ యాప్స్‌‌ను మీరు మాన్యువల్‌గా రిమూవ్ చేయటం సాధ్యపడదు. కాబట్టి, ముందుగా ఫోన్‌లోని developer optionను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఫోన్ Settings -> About Phone -> Build Number పై 7 నుంచి 10 సార్లు టాప్ చేయటం ద్వారా developer option ఎనేబుల్ అవుతుంది.

స్టెప్ 2

స్టెప్ 2

ఇప్పుడు మరోసారి ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే developer option కనిపిస్తుంది. డెవలపర్ ఆప్షన్‌ ఓపెన్ చేసినట్లయితే, మీకు USB Debugging పేరుతో మరో ఆప్షన్ కనిపిస్తుంది. ఎనేబుల్ చేసుకోండి.

స్టెప్ 3
 

స్టెప్ 3

ఇప్పుడు మీ విండోస్ పీసీలో Debloater టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ టూల్ మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని సిస్టం యాప్స్‌ను రిమూవ్ చేయగలదు.

స్టెప్ 4

స్టెప్ 4

యూఎస్బీ కేబుల్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను పీసీకి కనెక్ట్ చేయండి. Debloater టూల్ మీ డివైస్‌ను డిటెక్ట్ చేసేంత వరకు వెయిట్ చేయండి.

స్టెప్ 5

స్టెప్ 5

డివైస్ డిటెక్ట్ అయిన వెంటనే మీ ఫోన్‌లోని యాప్స్ మొత్తం స్కాన్ కాబడతాయి. వాటిలో Pre-Installed Appsను మార్క్ చేసుకుని apply బటన్ పై క్లిక్ చేసినట్లయితే అవి రిమూవ్ కాబడతాయి.

Rooted ఆండ్రాయిడ్ ఫోన్‌లో Bloatware యాప్స్‌ను తొలగించేందుకు ఈ క్రింది మార్గాలను అనుసరించండి..

Rooted ఆండ్రాయిడ్ ఫోన్‌లో Bloatware యాప్స్‌ను తొలగించేందుకు ఈ క్రింది మార్గాలను అనుసరించండి..

System App Remover అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ అయిన System App Remover యాప్‌ను ఫోన్ లో లాంచ్ చేయండి. యాప్ లాంచ్ అయిన తరువాత మీరు రిమూవ్ చేయాలనుకుంటున్న యాప్ ను సెలక్ట్ చేసుకుని ‘Uninstall' పై టాప్ చేయండి. ఈ విధంగా రూట్ కాబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌లో Bloatware యాప్స్‌ను తొలగించవచ్చు.

Best Mobiles in India

English summary
What is Bloatware and how to get rid of it on your Android phone.Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X