ఫోన్ అన్‌లాకింగ్ అంటే ఏంటి..? ఎప్పుడు చేస్తారు..?

సాధారణంగా ఓ నెట్‌వర్క్ క్యారియర్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఫోన్ సంబంధిత నెట్‌వర్క్‌తో లాకై ఉంటుంది.

ఫోన్ అన్‌లాకింగ్ అంటే ఏంటి..? ఎప్పుడు చేస్తారు..?

Read More : నేటి నుంచే రెడ్మీ నోట్ 4 అమ్మకాలు, ఎలా కొనాలంటే..?

ఈ క్రమంలో ఆ కాంట్రాక్ట్ ముగిసేంత వరకు ఆ ఫోన్‌లో వేరొక నెట్‌వర్క్‌ను ఉపయోగించటం సాధ్యపడదు. కాంట్రాక్ట్ ముగియకుండానే ఆ ఫోన్‌లో వేరొక నెట్‌వర్క్‌ను వినియోగించుకోవాలనుకుంటే చాలా రిస్క్ తీసుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫోన్‌ను అన్‌లాక్ చేయాలంటే సంబంధిత అన్‌లాక్ సాఫ్ట్‌‌వేర్‌ను సదరు డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయవల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంత సలువుగా దొరకనివ్వవు

అయితే నెట్‌వర్క్ క్యారియర్లు వాళ్లకు సంబంధించిన అన్‌లాక్ సాఫ్ట్‌వేర్‌లను ఆయా కంపెనీలు అంత సలువుగా దొరకనివ్వవు. దాదాపు అన్ని ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ క్యారియర్లు కాంట్రాక్ట్ గడువు ముగిసిన తరువాతనే ఫోన్ అన్‌లాకింగ్‌కు సహకరిస్తాయి.

అన్‌లాక్ చేయదలచుకుంటే..

కాంట్రాక్ట్ సమయం గడవక ముందే మీరు మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయదలచుకుంటే కొంత మొత్తాన్నివాళ్లకి చెల్లిస్తే అన్‌లాక్ చేసే అవకాశముంది. లేదా మీరు వేరొక దేశానికి వెళిపోతున్నట్లు చెబితే అన్‌లాక్ చేసే అవకాశముంది.

అన్‌లాక్ చేయటం వల్ల కలిగే లాభాలు

మీ ఫోన్‌లో ఇతర నెట్‌వర్క్‌‌లను యాక్సెస్ చేసుకుని తక్కువ ధరలకే కాల్స్, ఎస్ఎంఎస్ ఇంకా ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు.

అన్‌లాక్ చేయటం వల్ల కలిగే లాభాలు

ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో ఇతర నెట్‌వర్క్‌‌ల ద్వారా తక్కువ రోమింగ్ చార్జీలను పొందవచ్చు. వివిధ నెట్‌వర్క్ బ్యాండ్‌లను ఉపయోగించుకోవచ్చు.

అన్‌లాక్ చేయటం వల్ల కలిగే లాభాలు

ఫోన్ రీసేల్ విలువ పెరిగే అవకాశం. చవక డీల్స్‌తో పాటు తక్కువ ధర టారిఫ్‌లను పొందవచ్చు. ఇతర సిమ్‌లను వినియోగించుకోవచ్చు. డ్యుయల్ సిమ్ అడాప్టర్‌ల సహాయంతో రెండు నెట్ వర్క్ లను ఉపయోగించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What Is Phone Unlocking?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot