మీరు వాడుతున్న మొబైల్ సిమ్ మీ పేరుమీద లేదా..?

మీరు వాడుతున్న మొబైల్ సిమ్ తాలూకా ప్రూఫ్స్ మీ పేరుమీద లేవా? మరి ఆ సిమ్‌ను మీ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవటం ఎలా? ప్రస్తుత పరస్థితులను పరిశీలించినట్లయితే మొబైల్ సిమ్ జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రోజురోజుకు మరింత కఠినతరంగా మారిపోతున్నాయి.

Read More : రూ.14,000కే 6జీబి ర్యామ్‌ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫిబ్రవరి 6, 2018లోపు..

సుప్రీంకోర్ట్ ఉత్తర్వుల ప్రకారం దేశంలోని ప్రతి సిమ్ కార్డ్‌ను ఆధార్ నెంబర్‌తో లింకప్ చేయవల్సి ఉంది. ఈ గడువు ఫిబ్రవరి 6, 2018లోపు ముగుస్తుంది.

మీ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు

ఈ నేపథ్యంలో వేరొకరి ప్రూఫ్స్‌తో మీరు వినియోగించుకుంటోన్న సిమ్‌ కనెక్షన్‌ను మీ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు సరైన ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ వివరాలతో సమీపంలోని

ముందుగా మీరు వాడుతున్న సిమ్ ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉందో వారి ఫోటో, ఆధార్, అడ్రస్ ప్రూఫ్‌లతో పాటు వారి సంతకంతో కూడిన ఫారమ్‌తో మీ ఐడీ ప్రూఫ్‌లను కూడా సమీపంలోని కస్టమర్ కేర్ సెంటర్‌లకు తీసుకువెళ్లండి. అవసరమైతే ఆ వ్యక్తిని మీ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది.

సిమ్ ఓనర్ షిప్‌ మీ పేరు మీదకు మారుతుంది...

వాళ్లు మొత్తం వివరాలను పరిశీలించాక సిమ్ ఓనర్ షిప్‌ను మీ పేరు మీదకు మార్చటం జరుగుతుంది. ఒకేవేళ వాళ్లు మీ అభ్యర్థనను తిరస్కరించినట్లయితే అందుకు గల కారణాలను మెయిల్ రూపంలో తెలియజేయమని చెప్పండి. అలా పంపిన వివరాలను మీరు వాడుతోన్న నెట్‌వర్క్ ఆపరేటర్ తాలుకా నోడల్ అధికారికి ఫార్వర్డ్ చేయండి. సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

రెడ్‌మి నోట్ 4 రికార్డ్, 6 నెలల్లో 50 లక్షల ఫోన్‌ల అమ్మకాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What is the procedure to change the name of a SIM card which is not in my name?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot