శాంసంగ్ నుంచి వచ్చే ప్రతి ఆవిష్కరణలో ఏదో కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా శాంసంగ్ Galaxy S9, Galaxy S9 plus ఫోన్ల కెమెరాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ఈ ఫోన్లలో కెమెరా పనితీరు చాలా బాగుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో పొందుపరిచిన కెమెరాలు ఔత్సాహికులకు మంచి ఆనందాన్ని ఇస్తున్నాయని, ఫోటోలు చాలా అందంగా వస్తున్నాయని చెబుతున్నారు. లో లైట్లో కూడా అదిరిపోయే ఫోటో షాట్లు తీసుకునే విధంగా కెమెరాలు ఉన్నాయి. స్లో మోషన్ వీడియోల అదనపు ఆకర్షణ కాగా ఏఆర్ ఎమోజీలతో కెమెరా ప్రపంచంలో ఈ ఫోన్లు సరికొత్త ఒరవడికి నాంది పలికాయని కంపెనీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
వాట్సప్‌లోకి కొత్తగా అదిరే ఫీచర్, డిలీట్ బాధకు ఇకపై సెలవు !
Dual aperture
మీరు ఈ ఫోటోని పరిశీలించినట్లయితే కెమెరా పనితీరు ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. F1.5 aperture modeతో నైట్ ఫోటోలు తీసినప్పుడు లైట్ ఆటోమేటిగ్గా తనకు తగినట్లుగా తీసుకుంటుంది. ఫోటో లో లైట్లో కూడా చాలా క్లియర్ గా వచ్చింది. అదే డే టైంలో తీసినప్పుడు F2.4 modeతో ఫోటో తీసినప్పుడు అది చాలా షార్ప్ గా కనిపించింది. కెమెరాల లెన్స్ పనితీరు అంత అద్భుతంగా పనిచేస్తున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.
Super Slow-mo
ఈ కెమెరాల్లో ప్రధాన ఆకర్షణ స్లో మోషన్ ఫీచర్. సెకండ్ కి 960 framesతో వీడియో సెట్ చేయవచ్చు.ఇలా షూట్ చేసుకున్న వీడియోలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను యాడ్ చేయవచ్చు. అందుకు గాను 35 రకాల భిన్నమైన మ్యూజిక్‌లను ఈ ఫోన్లలో అందిస్తున్నారు. మూడు రకాలుగా స్లో మోషన్ వీడియోలు తీయవచ్చు. మీ లాక్ స్క్రీన్ మీద ఈ స్లో మోషన్ వీడియోలు మళ్లీ మళ్లీ వచ్చేలా సెట్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.
Optical image stabilization
మీరు మూవ్ అవుతున్న సమయంలో కూడా ఫోటోని ఎటువంటి అంతరాయం లేకుండా తీసుకునే సౌకర్యం ఉంది. ఇందుకోసం ఆప్టికల్ ఇమేజ్ Stabilization ఫీచర్ మీకు సహకరించనుంది. గెలాక్సీ ఎస్9లో వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయగా, ఎస్9 ప్లస్‌లో వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఇచ్చారు. ఇవి f/1.5 పవర్‌ఫుల్ అపర్చర్ సైజ్‌ను కలిగి ఉండడంతో వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు క్వాలిటీగా వస్తాయి.
Live focus
ఈ ఫీచర్ ద్వారా మీరు ఫోటో తీసుకునే సమయంలో మీకు నచ్చిన విధంగా అడ్జెస్ట్ మెంట్ చేసుకునే సౌకర్యం ఉంది. కెమెరాలను మెరుగు పర్చడంతో పాటు ఎస్9 ప్లస్‌లో ద్వంద్వ రియర్ కెమెరాలను, అలాగే ఫేస్ రికగ్నిషన్, ఎఆర్ (అగ్‌మెంటెట్ రియాలిటీ) ఎమోజీ ఫీచర్‌ను జోడించింది.
టెలిఫొటో లెన్స్
గెలాక్సీ ఎస్9 ప్లస్‌లో వెనుక భాగంలో అమర్చిన రెండు కెమెరాల్లో ఒక కెమెరా టెలిఫొటో లెన్స్‌ను కలిగి ఉంది. దీంతో ఈ కెమెరా ద్వారా 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ వంటి ఫీచర్లను పొందవచ్చు. ఇక రెండు ఫోన్లలోనూ ఉన్న కెమెరాల ద్వారా సూపర్ స్లో మోషన్ వీడియోలను చిత్రీకరించవచ్చు.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.