ఫోన్‌లో బంగారం ఎక్కడుంటుంది?, ఎలా బయటకు తీస్తారు?

ప్రపంచవ్యాప్తంగా వాడి పారేసిన మొబైల్ ఫోన్‌ల నుంచి ఏటా 1000 కిలలో బంగారం, 5000 కిలలో వెండి ఇతర విలువైన పదార్థాలను సేకరిస్తున్నారట. సంవత్సరానికి 400 మిలియన్ మొబైల్ ఫోన్‌లను నిర్వీర్యం చేస్తున్నట్లు ఓ సర్వే చెబుతోంది. వీటిలో చైనా నుంచి పెద్ద మొత్తంగా ఏటా 100 మిలియన్ల వ్యర్థ మొబైళ్లను డిస్కార్డ్ చేస్తున్నట్లు వీరు స్పష్టం చేశారు. వీటి నుంచి 1500కిలలో బంగారాన్ని వారు రాబట్టగలిగారట.

Read More : ఇక తెలుగులోనూ ఈ-మెయిల్ ఐడీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

cyanide వంటి ప్రమాదక కెమికల్స్‌

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై ఓ కెమెకిల్‌ను ప్రయోగించి బంగారాన్ని రాబడుతున్నట్లు ఓ సర్వే నిగ్గు తేల్చింది. పాత గాడ్జెట్‌ల నుంచి బంగారాన్ని వెలికితీసేందుకు అనుసరిస్తోన్న ప్రస్తుత పద్ధతలు చాలా ప్రమాదంతో కూడుకుని ఉన్నాయని బ్రిటన్‌కు చెందిన ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. పాత పద్ధతుల్లో భాగంగా ఫోన్‌ల నుంచి బంగారాన్ని సేకరించేందుకు cyanide వంటి ప్రమాదక కెమికల్స్‌ను వాడవల్సి ఉంటుందని వీరు చెబుతున్నారు. సైనైడ్ వంటి కెమికల్స్ మనిషి ఆరోగ్యానికి చాలా హానీ కలిగిస్తాయి. వీటిలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు కోల్పొవటం తద్యం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎడిన్బర్గ్ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ..

భవిష్యత్‌లో ఇటువంటి టాక్సిక్ కెమికల్స్ జోలికి పోకుండా సాధారణ వెలికితీత పద్ధతుల ద్వారా బంగారాన్ని సేకరించేందుకు సరికొత్త మార్గాన్ని కొనుగొన్నట్లు ఎడిన్బర్గ్ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ జాసన్ లవ్ తెలిపారు. రసాయన శాస్త్రం ఆధారంగా కొనగొనబడిన సరికొత్త కాంపౌండ్ ద్వారా ఎటువంటి ప్రమాదం లేకుండా గాడ్జెట్‌లను నుంచి బంగారం వంటి విలువైన లోహాలను వెలికితీయవచ్చని శాస్తవేత్తలు చెబుతున్నారు. ఈ పద్ధతిలో భాగంగా ముందుగా ఆయా గాడ్జెట్‌లకు సంబంధించిన ప్రింటెండ్ సర్క్యూడ్ బోర్డ్‌లను తేలికపాటి యాసిడ్‌లో ఉంచుతారు. ఈ యాసిడ్ సర్క్యూడ్ బోర్డ్‌లోని అన్ని లోహపు భాగాలను కరిగిస్తుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేకమైన కెమికల్ కాంపౌండ్ సహాయంతో కరిగిన ధ్రవం నుంచి బంగారం వంటి విలువైన లోహాలను వేరు చేస్తారు.

పాత ఐఫోన్‌ల నుంచి...

పాత ఐఫోన్‌ల నుంచి గతేడాది ఆపిల్ కంపెనీ దాదాపు టన్ను బంగారాన్ని సేకరించినట్లు సమాచారం. ఐఫోన్‌ల నుంచే కాకుండా మాక్‌బుక్స్, ఐపాడ్స్ నుంచి బంగారం రాబట్టుకుంటుందోని కంపెనీ వార్షిక పర్యావరణ రిపోర్ట్‌ తెలిపింది. మరీ ఫోన్ నుంచి బంగారం తీయడం ఎలా సాధ్యం అవుతుందని అనుకోవచ్చు కదా..తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని చెబుతోంది ఆపిల్ కంపెనీ.

రీసైక్లింగ్ చేయడం ద్వారా

యాపిల్ త‌న పాత ఐఫోన్లను రీసైక్లింగ్ చేయడం ద్వారా బంగారం..ఇత‌ర మెట‌ల్స్ ను ఐఫోన్ స‌మ‌కూర్చుకుంటుంది. అంటే..మొత్తం స్క్రాప్ నుంచి మాత్ర‌మే కాదు.. కొత్త వాటిని కూడా కొనుగోలు చేస్తుంటారు. పాత గాడ్జెట్లను, ఫోన్లను రీసైక్లింగ్ చేసి, బంగారాన్ని తీసుకుంటుందట.

30 మిల్లీ గ్రాముల బంగారం..

సగటున ఒక్కో ఐఫోన్ తయారీలో 30 మిల్లీ గ్రాముల బంగారం ఉపయోగిస్తారు. గతేడాది ఇలా దాదాపు 2,204 పౌండ్ల (టన్ను కంటే ఎక్కువ) బంగారాన్ని ఐఫోన్లను, ఐపాడ్లను, ఐమాక్లను పగలగొట్టి రీసైక్లింగ్ చేసుకుందని కంపెనీ వార్షిక పర్యావరణ రిపోర్టులో తెలిపింది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యాపిల్ సేక‌రించిన బంగారం వెయ్యి కిలోలు..?

వాడేసిన ఫోన్ల నుంచి యాపిల్ సేక‌రించిన బంగారం బ‌రువు ఎంతో తెలుసా? అక్ష‌రాల వెయ్యి కిలోలు. తాజాగా కంపెనీ వార్షిక ప‌ర్యావ‌ర‌ణ నివేదిక‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వీటి విలువ దాదాపు 40 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తుప్పు పట్టకుండా, ఎక్కువ కాలం పనిచేసేలా, అద్భుతమైన విద్యుత్ వాహకంలా బంగారం ఉపయోగపడుతుంది.

వెండి, రాగి

వెండిని, రాగిని కూడా ఫోన్‌లలో వాడతారు. అయితే అవి త్వరగా తుప్పు పట్టి, పాడయ్యే అవకాశాలు అధికంగా ఉండడం, అతి ముఖ్యమైన వేళ ఎలక్ట్రాన్లను మెల్లగా ప్రయాణించేలా చేయడం వల్ల వీటిని గ్యాడ్జెట్లలో తక్కువగా వాడతారు.

90 మిలియన్ పౌండ్ల ఈ-వేస్ట్‌

90 మిలియన్ పౌండ్ల ఈ-వేస్ట్‌ను రీసైక్లింగ్ ప్రోగ్రామ్స్ ద్వారానే చేపడతామని, పునర్వినియోగ పదార్థాల నుంచి 61 మిలియన్లు రాబట్టుకున్నామని యాపిల్ సంస్థ తెలిపింది. పాత గ్యాడ్జెట్ల నుంచి తీసుకున్న పదార్థంలో బంగారం ఒకటని పేర్కొంది.

బంగారమే వెయ్యి కిలోలు అయితే..

 మిగిలిన మెట‌ల్స్ ను రీసైక్లింగ్‌ద్వారా ఎంత స‌మ‌కూర్చుకుంటుందోనని అందరూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. యాపిల్ మొత్తం 90 మిలియ‌న్ పౌండ్ల ఈ-వేస్ట్ ను రీసైక్లింగ్ చేసి 61 మిలియ‌న్ పౌండ్ల మెట‌ల్స్ ను ఐఫోన్ల వినియోగానికి ఉప‌యోగిస్తుంద‌ట‌.

ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడొచ్చ‌ు..

రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా యాపిల్ సేకరించిన బంగారం దాదాపు 1000 కిలోల వ‌ర‌కూ ఉంటే.. ఉక్కు 1.04ల‌క్ష‌ల కిలోలు.. ఫ్లాస్టిక్ 58,967 కిలోలు.. గ్లాస్ 54,431 కిలోలు.. అల్యూమినియం 20,411 కిలోలు.. రాగి 13607 కిలోలు.. వెండి 2993 కిలోలు ఉన్నాయ‌ట‌. ఈ రీసైక్లింగ్ విధానం వ‌ల్ల భూమి నుంచి లోహాల్ని తీసుకునే అవ‌స‌రం త‌గ్గుతుంద‌ని.. దీంతో ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడొచ్చ‌ని యాపిల్ చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What Parts In a Cell Phone are Gold. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot