Home
Mobile

LeEco నుంచి మరో ఆఫర్ల పండుగ.. మునుపెన్నడు ఇవ్వని డిస్కౌంట్‌లతో

By Sivanjaneyulu Bommu

సూపర్ ఫోన్‌లు.. సూపర్ టీవీలు, ఇలా నిత్యం సరికొత్త ఆవిష్కరణలతో ఇండియన్ మార్కెట్లో సంచలరం రేపుతోన్న చైనా టెక్నాలజీ దిగ్గజం LeEco కనీవినీ ఎరగని డిస్కౌంట్ ఆఫర్లతో మరో షాపింగ్ ఫెస్టివల్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

 LeEco నుంచి మరో ఆఫర్ల పండుగ.. మునుపెన్నడు ఇవ్వని డిస్కౌంట్‌లతో

ఇప్పటికే మెయిన్‌ల్యాండ్‌ చైనా, హాంకాంగ్, యూఎస్ మార్కెట్లలో గ్రేట్ షాపింగ్ ఈవెంట్‌‌ను LeEco దిగ్విజయంగా నిర్వహించగలిగింది. వీటికి అద్బుతమైన స్పందన లభించటంతో భారత్‌లోనూ అదే తరహా షాపింగ్ ఈవెంట్‌లను నిర్వహించేందుకు లీఇకో ప్రణాళికలు రచిస్తోంది.

#1

#1

తన సూపర్‌ఫోన్‌లతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన LeEco అతితక్కువ కాలంలోనే పటిష్టమైన మార్కెట్ షేర్‌ను కొల్లగొట్టగలిగింది. ఇందుకు నిదర్శనం LeEco అధికారిక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన LeMall.com భారత్‌లో 7.5 మిలియన్ల యునిక్ విజటర్లను కలిగి ఉండటమే.

#2

#2

LeEco నిర్వహించబోతోన్న గ్రేడ్ షాపింగ్ ఫెస్టివల్స్‌లో భాగంగా తన సూపర్‌ఫోన్స్, సూపర్‌టీవీలతో పాటు ఇతర ఉపకరణాల పై మునుపెన్నడు ఇవ్వని డిస్కౌంట్‌లతో పాటు ఉచిత గిఫ్ట్‌లను ఆఫర్ చేయబోతోన్నట్లు సమాచారం.

#3

#3


లీ 1ఎస్, లీ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లతో ఇండియన్ మార్కెట్లోకి రంగప్రవేశం చేసిన LeEco ఆ తరువాత వెనక్కితిరిగి చూసుకోలేదు. ఈ ఫోన్‌లు ఊహించని సంఖ్యలో అమ్ముడుపోవటంతో లీ1ఎస్ ఇకో, లీ2, లీ మాక్స్2 స్మార్ట్‌ఫోన్‌లను లీఇకో మార్కెట్లో లాంచ్ చేసింది.

#4

#4

అంతేకాకుండా, సూపర్‌టైన్‌మెంట్ ప్యాకేజీతో కూడిన ప్రత్యకమైన కంటెంట్ ఇకో సిస్టంను కూడా లీఇకో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ-కామర్స్ ఛానల్ అయిన LeMall.comను తొలత చైనా మార్కెట్లో 2013లో LeEco చేసింది.

#5

#5

చైనా ప్రధాన భూబాగంతో పాటు అమెరికా, హాంగ్ కాంగ్ దేశాల్లో లీమాల్.కామ్‌కు మంచి పాపులారిటీ ఉంది. భారత్‌లో LeMall.comను జూన్ 2016లో ప్రారంభించారు. నెటిజనులకు సౌకర్యవంతమైన ఆన్‌లైన్ షాపింగ్ అనుభూతులను అందించే లక్ష్యంతో అందుబాటులోకి వచ్చిన లీమాల్ ఇండియా ఆధునిక లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా హైక్వాలిటీ లీఇకో గాడ్జెట్‌లను అందిస్తోంది.

#6

#6

LeMall ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో లీఇకోకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్లు, ఆల్ మెటల్ ఇయర్‌ఫోన్లు, బ్లూటూత్ హెడ్‌ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు అందుబాటులో ఉంటాయి.

#7

#7

లీఇకో అసలు పేరు Letv, చైనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతుంది. Jia Yueting, Liu Hongలు ఈ సంస్థను నవంబర్ 2004లో ప్రారంభించారు.

#8

#8

ఈ కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టిన LeEcoకు వ్యాపార పెట్టుబడుల రూపంలో 12 బిలియన్ యూస్ డాలర్లు ఉన్నాయి. చైనాలోని బీజింగ్ లో ప్రధాన కార్యాలయం, హాంగ్ కాంగ్, లాస్ యాంజిల్స్ ఇంకా సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
LeEco is rumoured to be hosting an EPIC shopping fest for its Indian users. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X