ఖరీదైన స్మార్ట్‌న్ కొనేముందు ఈ విషయాలు గుర్తుచేసుకోవడం మరచిపోవద్దు
ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?,
ఈ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..?, మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ డివైజ్ ఏలాంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండాలి..?, ఫోన్ కొనుగోలు సమయంలో ఏఏ అంశాలను నిశితంగా పరిశీలించాలి..? స్మార్ట్‌ఫోన్ ఎంపిక విషయంలో తీసుకోవల్సిన ముఖ్యమైన అంశాలను సూచిస్తూ గిజ్‌బాట్ ఓ ప్రత్యేక కథనాన్ని మీముందుకు తీసుకువచ్చింది. మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనేముందు ఈ విషయాలను ఓ సారి గుర్తుచేసుకుని వెళ్లడం వలన మనకు కొంచెం ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. అవేంటో ఓ సారి చూద్దాం.

స్ర్కీన్‌సైజ్:
స్మార్ట్‌ఫోన్ ఎంపికలో భాగంగా స్ర్కీన్‌సైజ్ కీలక పాత్ర పోషిస్తుంది. 3 అంగుళాల నుంచి 5 అంగుళాల స్ర్కీన్ పరిమాణం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతాయి. ఇటీవల కాలంలో 6 అంగుళాల స్ర్కీన్ వేరింయట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతన్నాయి. వీటిని ఎంపిక చేసుకోవటం వల్ల ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరింత క్వాలిటీతో కూడుకుని ఉంటుంది.

సౌకర్యవంతమైన డిస్‌ప్లే:
మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే మన్నికదై ఉండాలి. సూపర్ ఆమోల్డ్ ప్లస్, క్లియర్ ఎల్‌సీడీ, యాపిల్ రెటీనా డిస్‌ప్లేతో కూడిన అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవతున్నాయి.

ప్రాసెసర్:
ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్‌కు గుండెకాయ లాంటిది. వేగవంతమైన ప్రాసెసర్ ఫోన్ పనితీరును మరింత మెరగుపరుస్తుంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లో 1గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ లేదా క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉండేలా చూసుకోండి.

కెమెరా:
మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ ఫోన్ లో కెమెరా వ్యవస్థ మరింత సమర్థవంతమైనదిగా ఉండాలి. ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా వ్యవస్థలు మన్నికతో కూడిన పనితీరును కనబరచాలి.

శక్తివంతమైన బ్యాటరీ:
స్మార్ట్‌ఫోన్ సమగ్రంగా పనిచేయాలంటే శక్తి ఎంతో అవసరం. మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. మీ ట్యాబ్లెట్ 4000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది.

కనెక్టువిటీ ఫీచర్లు:
మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన కనెక్టువిటీ ఫీచర్లను కలిగి ఉండాలి. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు సమర్థవంతంగా ఉన్నప్పుడే వెబ్ బ్రౌజింగ్ వేగవంతంగా ఉంటుంది.

స్టోరేజ్:
మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ బలోపేతమైన స్టోరేజ్ వ్యవస్థను కలిగి ఉండటం అవసరం. మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో లభ్యమవుతున్నాయి.


Click it and Unblock the Notifications