విండోస్ ఫోన్‌ల కోసం ‘వాట్స్ అప్లికేషన్’!

ఇప్పుడు, తాజా వర్షన్ ‘వాట్స్ అప్లికేషన్ ను ’(whatsapp)ను విండోస్ ఫోన్ యూజర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వర్షన్ 2.8కు వృద్ధి చెందిన ఈ అప్లికేషన్ సేవలను వినియోగదారు సంవత్సరం పాటు ఉచితంగా పొందవచ్చు. తరువాత నుంచి ఏడాదికి $0.99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ తాజా వర్షన్ వాట్స్ అప్లికేషన్ సరికొత్త మొబైలింగ్ అనుభూతులను యూజర్‌కు చేరువచేస్తుంది. సెర్చ్, స్టేటస్, క్రియేట్ గ్రూప్ వంటి కొత్త ఆప్షన్‌లు న్యూవర్షన్ ‘వాట్స్ యాప్’లో తోడైయ్యాయి. వాట్స్ అప్లికేషన్ మెసెంజర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఆపిల్ ఐవోఎస్,
బ్లాక్‌బెర్రీ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
విండోస్ ఆధారితంగా స్పందించే నోకియా లూమియా 900 ఫీచర్లు:
మైక్రోసాఫ్ట్ విండోస్ పోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
4.3 అంగుళాల అమోల్డ్ టచ్‌స్ర్కీన్ (సుసంపన్నమైన 16 మిలియన్ల రంగులతో),
8 మెగా పిక్సల్ కెమెరా, రిసల్యూషన్ 3264 × 2448పిక్సల్స్, కార్ల్‌జిస్ ఆప్టిక్స్, ఆటోఫోకస్, డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్,
1మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1.4గిగాహెట్జ్ స్కార్పియన్, క్వాల్కమ్ ఏపీక్యూ8055 స్నాప్ డ్రాగెన్,
16జీబి స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్,
లియోన్ 1830ఎమ్ఏహెచ్ స్టాండర్డ్ బ్యాటరీ,
ఇండియన్ మార్కెట్లో ధర రూ.38,889.


Click it and Unblock the Notifications








