జియో‌ఫోన్‌లలో ప్రారంభమైన WhatsApp messenger సేవలు

వాట్సాప్ మెసెంజర్ ఇప్పుడు జియో ఫోన్‌లలో లభ్యమవుతోంది.

|

వాట్సాప్ మెసెంజర్ ఇప్పుడు జియో ఫోన్‌లలో లభ్యమవుతోంది. జియోఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను మరింత స్మూత్‌గా యాక్సిస్ చేసుకునేందుకుగాను KaiOS ఆపరేటింగ్ సిస్టం కోసం ప్రత్యేకమైన వెర్షన్‌ను వాట్సాప్ బిల్ట్ చేసింది. ఈ కొత్త వెర్షన్ వాట్సాప్ మెసేజింగ్ యాప్ ద్వారా జియో ఫోన్ యూజర్లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజెస్‌ను మరింత సలువుగా సెండ్ చేసుకునే వీలుంటుంది.

 

 సెప్టంబర్ 10 నుంచి జియోఫోన్ యాప్ స్టోర్‌లో లభ్యం..

సెప్టంబర్ 10 నుంచి జియోఫోన్ యాప్ స్టోర్‌లో లభ్యం..

జియో ఫోన్‌ల కోసం డిజైన్ చేసిన వాట్సాప్ స్పెషల్ వెర్షన్ యాప్ సెప్టంబర్ 10 నుంచి జియోఫోన్ యాప్ స్టోర్‌లో అఫీషియల్ డౌన్‌లోడింగ్ నిమిత్తం లభ్యమవుతోంది. సెప్టంబర్ 20 నాటికి అన్ని జియో ఫోన్‌లలో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్ వెర్షన్‌ వాట్సాప్ యాప్ గురించి వాట్సాప్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ డానియల్స్ స్పందిస్తూ జియోఫోన్‌లను వినియోగించుకుంటోన్న లక్షలాది మంది యూజర్లు ఇక వాట్సాప్ ప్రయివేట్ మెసేజింగ్ యాప్‌ను బెస్ట్ మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో వినియోగించుకోవచ్చని అన్నారు.

 

 

టీ9 కీప్యాడ్‌ను వినియోగించుకోవల్సి ఉంటుంది..

టీ9 కీప్యాడ్‌ను వినియోగించుకోవల్సి ఉంటుంది..

జియోఫోన్ యూజర్లు వాట్సాప్ మెసేజ్‌లను టైప్ చేసే క్రమంలో టీ9 కీప్యాడ్‌ను వినియోగించుకోవల్సి ఉంటుంది. జియో ఫోన్‌లకు సంబంధించి ఇప్పటి వరకు చోటుచేసుకున్న అప్‌డేట్‌లను పరిశీలించినట్లయితే సరిగ్గా నెల రోజుల క్రితమే రిలయన్స్ జియో తన జియోఫోన్ 2ను మార్కెట్లో లాంచ్ చేసింది. జియో‌ఫోన్‌కు అప్ డేటెడ్ వెర్షన్‌గా ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది.

జియోఫోన్ 2 స్పెసికేషన్స్..
 

జియోఫోన్ 2 స్పెసికేషన్స్..

2.4 ఇంచ్ హారిజెంటల్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఫుల్ క్వెర్టీ కీప్యాడ్ అండ్ ఫోర్-వే నేవిగేషన్ ప్యాడ్, kia మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 205 లేదా స్ప్రెడ్‌ట్రమ్ SC9820 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కేమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

ఫేస్‌బుక్ ఇంకా యూట్యూబ్ సపోర్ట్ కూడా...

ఫేస్‌బుక్ ఇంకా యూట్యూబ్ సపోర్ట్ కూడా...

KaiOS పై రన్ అవుతోన్న జియోఫోన్స్ కోసం సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకమైన గూగుల్ మ్యాప్స్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే సమయంలో ఫేస్‌బుక్ సేవలు కూడా జియో ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసాయి. జియో ఫోన్‌లలో యూట్యూబ్ సర్వీసును పొందాలనుకునే యూజర్లు ముందుగా తమ డివైస్‌లోని జియో స్టోర్‌లోకి వెళ్లి సంబంధిత యాప్‌ను సెలక్ట్ చేుసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇదే విధంగా వాట్సాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ రెండు యాప్‌లను వాయిస్ కమాండ్స్ ఆధారంగా కూడా ఆపరేట్ చేసుకునే వీలుంటుందని జియో చెబుతోంది.

 

 

 

Best Mobiles in India

English summary
WhatsApp messenger is now available on JioPhone, JioPhone 2.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X