మిల్క్ బ్యూటీకి భలే మంచి భేరం!!

Posted By: Super

మిల్క్ బ్యూటీకి భలే మంచి భేరం!!

 

గత ఏడాది మార్కెట్లో విడుదలైన ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ హెచ్‌టీ‌సీ సెన్సేషన్ అప్పట్లో సంచలనాన్ని నమోదు చేసింది. ఈ ఫోన్‌కు అప్ డేటెడ్ వర్షన్‌గా మరో స్మార్ట్ మొబైల్ రానుంది. ఆకర్షణీయమైన వైట్ కలర్ వేరియంట్‌లో రూపుదిద్దుకుంటున్న

న్యూ వర్షన్ హెచ్‌టీసీ సెన్సెషన్ మిల్క్ బ్యూటీని తలపిస్తుంది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది. అమర్చిన 4.3 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే వైడర్ స్ర్కీన్ పరిమాణాన్ని ఒదిగి మన్నికైన విజువల్ అనుభూతులను కలిగిస్తుంది. ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. డ్యూయల్ కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థ వేగవంతమైన పనితీరుకు తోడ్పడుతుంది. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన హై స్పీడ్ ఇంటర్నెట్, వేగవంతమైన

డేటా ట్రాన్స్‌ఫర్ వ్యవస్థలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. మార్చి నాటికి ‘న్యూ వర్షన్ హెచ్‌టీసీ సెన్సెషన్’అందుబాటులోకి రానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot