ఇండియాలో ప్రత్యక్షమైన ‘మిల్క్ బ్యూటీ’!!

Posted By: Super

 ఇండియాలో ప్రత్యక్షమైన ‘మిల్క్ బ్యూటీ’!!

 

ఫిబ్రవరి ప్రకటన నుంచి అభిమానులను ఊరిస్తూ ఉడికిస్తున్న మిల్క్ బ్యూటీ కలర్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ‘నోకియా లూమియా 800’ ఎట్టకేలకు ఇండియలో ప్రత్యక్షమైంది. ఈ విడుదలకు సంబంధించిన సమాచారాన్ని నోకియా ఇండియా తన ఫేస్‌బుక్‌లో పొందుపరిచింది. ‘లూమియా 800’ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, మెజెంటా, సియాన్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతున్నప్పటికి మిల్క్‌కలర్ వేరియంట్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.

నోకియా లూమియా 800 ఫీచర్లు:

* మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,

* 1.4 GHz స్కార్పియన్ ప్రాసెసర్,

* అడ్రినో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

* జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్,

* జీపీఆర్ఎస్, ఎడ్జ్ సపోర్ట్,

* వై-ఫై ఇంటర్నెట్ కనెక్టువిటీ,

* 3జి కనెక్టువిటీ,

* 3.7 అంగుళాల ఆమోల్డ్ మల్టీ టచ్ స్క్రీన్,

* ఇంటర్నల్ స్టోరేజి 16జీబి,

* ఫ్రీ స్కై డ్రైవ్ స్టోరేజ్ 25జీబి,

* 8 మెగా పిక్సల్ డ్యూయల్ LED ఫ్లాష్ రేర్ కెమెరా,

* 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* ధర రూ.24,000.

మర్డర్లు మొదలుకుని మిస్టరీ వార్తల వరకు మీ నోకియా ఫోన్‌లో!!

నోకియా సింబియాన్ వినియోగదారులకు శుభవార్త… త్వరలో మీ హ్యాండ్‌సెట్‌లో సరొకొత్త రీడర్ అప్లికేషన్ అప్‌డేట్ కానుంది. ఈ అప్లికేషన్ ప్రపంచపు తాజా సమాచారాన్ని ఎప్పిటికప్పుడు మీ ఫోన్ హోమ్ స్ర్కీన్ పై ప్రదర్శిస్తుంది. ఈ నిఫ్టి అప్లికేషన్ ఇతర సౌలభ్యతలు:

సులువైన ఇంటర్నెట్ యాక్సిస్, హోమ్‌స్ర్కీన్ ఎప్పికప్పుడు తాజా వార్తాలతో నిండి ఉంటుంది, క్లౌడ్ స్టోరేజ్ సౌలభ్యత, స్థానిక మరియు అంతర్జాతీయ వార్తలను యాక్సెస్ చేసుకునే సదుపాయం, బ్యాటరీ ఫ్రెండ్లీ,

ఆన్‌లైన్ డైరెక్టరీ, నోకియా బ్రౌజర్‌ను సపోర్ట్ చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot