జలగండం నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌ను కాపాడుకోవడం ఎలా..?

|

టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్ మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుందేమో అనే స్థాయికి ఇప్పుడు యూత్ అడిక్ట్ అయిపోయింది. అయితే స్మార్ట్‌ఫోన్ భద్రత కూడా నేడు ఎంతో కీలకమైన విషయం. స్మార్ట్‌ఫోన్ లో హ్యాంగింగ్ లేదా హీటింగ్ లాంటి సమస్యలకు రకరకాల సాఫ్ట్ వేర్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ స్మార్ట్ ఫోన్ ను ఫిజికల్ గా కాపాడుకోవడం మాత్రం మనచేతుల్లోనే ఉంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ నీళ్లలో పడితే అంతే సంగతులు. అలాగే పై ప్రమాదవశాత్తు నేలపై జారిపడినా స్మార్ట్‌ఫోన్ డ్యామేజి అయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాలను ముందే పసిగట్టి ఫోన్ తయారీ దారులు రకరకాల ప్రొటెక్టివ్ విధానాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా గ్లాస్ విషయంలోనూ, ఫోన్ బాడీ మెటీరియల్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక వాటర్ ప్రూఫ్ విషయానికి వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది సోని, సాంసంగ్ అనే చెప్పవచ్చు. ఈ రెండు కంపెనీలు పూర్తి స్థాయిలో వాటర్ ప్రూఫ్ బాడీలతో ఫోన్ లను మార్కెట్లోకి రిలీజ్ చేశాయి. ఐఫోన్ లాంటి సంస్థలు సైతం వాటర్ ప్రూఫ్ పైనే ఎక్కువగా శ్రద్ధపెట్టాయి. ఇలాంటి సందర్భంలో మీ స్మార్ట్‌ఫోన్ లేదా ఏదైనా స్మార్ట్ వేరబుల్ గాడ్జెట్ ను వాటర్ ప్రూఫ్ చేసుకునేందుకు ఎన్నో టెక్నిక్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో ఓసారి లుక్కేద్దాం...

 

మొబైల్ యూజర్లకు మరో మంచి శుభవార్తమొబైల్ యూజర్లకు మరో మంచి శుభవార్త

ఇన్‌గ్రేస్‌ ప్రొటెక్షన్ అంటే ఏమిటి ?

ఇన్‌గ్రేస్‌ ప్రొటెక్షన్ అంటే ఏమిటి ?

మీ స్మార్ట్ ఫోన్ వాటర్ లేదా ఇతర లిక్విడ్స్,డస్ట్ నుంచి కాపాడేందుకు వాటర్ రెసిస్టెన్స్ మెటీరియల్స్ తో కవర్ చేయాల్సి ఉంటుంది. ఎంత మేర రెసిస్టెన్స్ ఉంటే దాని సామర్థ్యాన్ని ఇన్‌గ్రేస్‌ ప్రొటెక్షన్ (ఐపీ)తో లెక్కకడతారు. ముందుగా ఘనపదార్థాల నుంచి ఫోన్ బాడీ ఎంతవరకూ తట్టుకోగలదు..ద్రవ పదార్థాల నుంచి ఎంత వరకూ రక్షించవచ్చు అనేది అంచనా వేయవచ్చు. ముఖ్యంగా వాటర్ ప్రూఫ్ అనేది ఎంత మేర ఉండగలదు. ఎంత లోతు వరకూ రక్షణ ఇస్తుంది అనేది అంచనా వేయాల్సి ఉంటుంద. దీన్ని బట్టే ఇన్‌గ్రేస్ ప్రొటెక్షన్ ను నెంబర్ల వారీగా కొలుస్తారు. ఐపీ రేటింగ్ 6గా ఉంటే పూర్తి స్థాయి స్టాండర్డ్ ప్రొటెక్షన్ గా పేర్కొనవచ్చు. కానీ పూర్తి స్థాయి వాటర్ ప్రూఫ్ కాదు. అదే రేటింగ్ 5గా ఉంటే చిన్న పాటి ధూళి రేణువుల నుంచి ప్రొటెక్షన్ లభించడం కష్టం. ఇక నీటిలో లోతైన ప్రాంతాల్లో 8 నుంచి 9 ఐపీ రేటింగ్ ఉంటే డివైస్ ను రక్షించుకోవచ్చు. అలాగే 7వ ఐపీ రేటింగ్ కలిగిన డివైజెస్ వాటర్ ప్రూఫ్ అయినప్పటికీ, నీటి లోతు పెరిగే కొద్ది రక్షణ ఇవ్వలేదు.

 

 

నా ఫోన్ ను వాటర్ ప్రూఫ్ చేసుకోవచ్చా ?
 

నా ఫోన్ ను వాటర్ ప్రూఫ్ చేసుకోవచ్చా ?

ప్రస్తుతం మీ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ దశలో వాటర్ ప్రూఫ్ కాకపోయినప్పటికీ, మార్కెట్ లో అందుబాటులో ఉన్న వాటర్ రిపెల్లెంట్ పూత పూసి వర్షాకాలంలో తాత్కాలికంగా తడి నుంచి కాపాడుకోవచ్చు. కొన్ని కంపెనీలు వాటర్ ప్రూఫ్ సొల్యూషన్ లను అందుబాటులోకి తెచ్చాయి. వీటిని ఫోన్ పై భాగంలో పూస్తే నీటి నుంచి కొంత మేర కాపాడవచ్చు. అయితే కొన్ని వేరబుల్ స్మార్ట్ గాడ్జెట్స్ ను మాత్రం వాటర్ ప్రూఫ్ చేసుకునే విషయంలో కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. అవేంటో చూద్దాం..

వాటర్ ఫై..

వాటర్ ఫై..

వాటర్ ఫై అనేది పలు ఎలక్ట్రానిక్ స్మార్ట్ డివైజెస్ ను రకరకాల ప్రమాదాల నుంచి కాపాడుకునే పరికరాలను, పరిష్కారాను కనుగొంటోంది. అందులో భాగంగా వేరబుల్ డివైజెస్ అయిన యాపిల్ వాచ్, ఫిట్ బిట్ బ్లేజ్ వంటి గాడ్జెట్స్ ను కాపాడుకునేందుకు పరిష్కారం అందుబాటులోకి తెచ్చింది. మీరు ఎంపిక చేసుకున్న గాడ్జెట్ లోపలి భాగంలో రబ్బర్ ఇన్ స్యులెటర్ ను ఒక ఇంజెక్ట్ చేయడం ద్వారా అదనపు లేయర్ ఏర్పడి వాటర్ ప్రూఫ్ గా మారతుంది. ముఖ్యంగా ఈ ఫిట్ నెస్ గాడ్జెట్స్ ను స్విమ్మింగ్ లేదా సముద్రంలో సర్ఫింగ్ సమయాల్లో పాడవకుండా కాపాడుకోవచ్చు.వాటర్ ఫై అందిస్తున్న ఈ వాటర్ ప్రూఫ్ కిట్ ధర 155 యూఎస్ డాలర్లు. దీని ద్వారా కేవలం వేరబుల్ గాడ్జెట్స్ మాత్రమే కాదు అమెజాన్ కిండల్ పేపర్ వైట్ ను కూడా వాటర్ ప్రూఫ్ చేసుకునే వీలుంటుంది. వాటర్ ఫై సొల్యూషన్స్ ద్వారా మీ గాడ్జెట్స్ ను ఎంచక్కా బీచ్ లేదా పూల్ సైడ్ లో కూడా వాడుతూ ఎంజాయ్ చేయొచ్చు.

 

 

 పీటుఐ సొల్యూషన్స్..

పీటుఐ సొల్యూషన్స్..

బ్రిటన్ కు చెందిన పీటూఐ సొల్యూషన్స్ గత కొన్ని దశాబ్దాలుగా ఎలక్ట్రానిక్ రక్షణ పరికరాలు, సొల్యూషన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ వాటర్ ప్రూఫింగ్ టెక్నాలజీని హ్యూవై పీ9, పీ 9 ప్లస్ స్మార్ట్ ఫోన్ లలో మాన్యుఫాక్చరింగ్ దశ నుంచే ప్రారంభించారు. అలాగే మోటొరోలా ఈ సిరీస్ ఫోన్ లో సైతం పీటూఐ సొల్యూషన్స్ వాడారు. లండన్ లోని దుర్హం యూనివర్సిటీలో డాక్టర్ స్టీఫెన్ కోల్సన్ ఒక వినూత్నమైన వాటర్ రిపెల్లెంట్ రసాయనాలను తయారు చేశారు. ఈ టెక్నాలజీ ప్రకారం ఫోన్ పై నీరు పడితే అది గుండ్రటి బిందువులుగా మారి జారిపోతుందే తప్ప ఏ ఇన్ లెట్ ద్వారాను ఇంకడం జరగదు. నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసిన ఈ రసాయన కోటింగ్ వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్ లో ఒక సంచలనం.

హెచ్ జెడ్ వో

హెచ్ జెడ్ వో

పీటూఐ మాదిరిగానే హెచ్ జెడ్ వో కూడా ఒక కెమికల్ సొల్యూషన్ దీన్ని కోటింగ్ వేసుకోవడం ద్వారా నీటి నుంచి ఫోన్ ను కాపాడు కోవచ్చు. ఇది కూడా నానో టెక్నాలజీ ద్వారా తయారుచేసిన కోటింగ్ అనే చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఫోన్ నీటిలో మునిగిపోయినప్పటికీ హెచ్ జెడ్ వో కోటింగ్ ఫోన్ ను పూర్తిగా వాటర్ ప్రూఫ్ చేసి ఉంచుతుంది. ప్రస్తుతం డెల్, మోటరోలా సంస్థలు ఈ వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్ ను వాడుతున్నాయి.

సెంబ్లాంట్..

సెంబ్లాంట్..

ఇది కూడా నానో టెక్నాలజీ సహాయంతో తయారు చేసిన ఒక వాటర్ ప్రొటెక్షన్ సొల్యూషన్, ఫోన్ అంతర్భాగాలను సైతం సెంబ్లాంట్ నీటి నుంచి కాపాడుతుంది. ఒక్కసారి ఈ కోటింగ్ వేస్తే ఇక జీవిత కాలం వాటర్ ప్రూఫ్ గా మీ డివైజ్ మారిపోతుంది. ఫోన్ లోని ఇంటర్నల్ భాగాల్లో కూడా నానో కోటింగ్ ద్వారా నీటి నుంచి కాపాడుకోవచ్చు. అయితే కేవలం వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్ మాత్రమే కాదు. భవిష్యత్తులో ఇన్విజబుల్ సొల్యూషన్స్ ( పారదర్శకంగా చేసే రసాయనం) యాంటి ఫింగ్ ప్రింట్, యాంటి స్క్రాచ్ లాంటి సొల్యూషన్స్ ఎన్నో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Why aren't all our smartphones waterproof right now More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X